రాజధాని గ్రామాలలో తీవ్ర ఉద్రిక్తత, 144 సెక్షన్

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ని అమరావతి నుంచి విశాఖపట్నం తరలించాలనే ప్రతిపాదన మీద చర్చించడానికి ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. అటువైపు క్యాబినెట్ సమావేశం జరుగుతుండగానే ఇటు రాజధాని పరిసర గ్రామాల ప్రజలు రోడ్లు ఎక్కారు. పరిస్థితి చేజారి పోకుండా పోలీసులు ఇప్పటికే కొన్ని గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. అయినప్పటికీ వీటిని లెక్కచేయకుండా రైతులు మహిళల తో పాటు రాజధాని పరిసర గ్రామాల ప్రజలు రోడ్ల పై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

మందడం గ్రామంలో మహిళలు, రోడ్లపై బైఠాయించి నిరసనలు వ్యక్తం చేశారు. పలు చోట్ల టైర్లు కాల్చారు. కొన్ని చోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. గొల్లపూడి లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళలు రైతులు వేలాది గా జాతీయ రహదారి పైకి వచ్చారు. రాజధాని మార్చొద్దంటూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి భూములిచ్చిన కొంతమంది రైతులు తాడు తీసుకొని వచ్చి రోడ్డు మీదే ఆత్మ హత్యకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. మహిళలు కంట తడి పెడుతూ, ప్రభుత్వాలను నమ్మి భూములు ఇస్తే రేపు పొద్దున మీరు కూడా ఇలాగే ఏడవ వలసి వస్తుందని విశాఖ వాసులకు సూచించారు. మరి కొంత మంది రైతులు, ఉద్దండ రాయని పాలెం వద్ద, తమను పెయిడ్ ఆర్టిస్ట్ లు అంటూ కథనాలు వేసిన మీడియా సంస్థ లకి చెందిన రిపోర్టర్ ల పై దాడి చేశారు.

మొత్తానికి రాజధాని పరిసర ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. మరి వీరి వేదన, కన్నీరు జగన్ కు కనిపిస్తాయా లేదా అనేది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో మోడీ..!?

ఇన్నాళ్ళు పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో మోడీ కాంగ్రెస్...

‘మిరాయ్’ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్‌

'హ‌నుమాన్‌' త‌ర‌వాత తేజా స‌జ్జా నుంచి వ‌స్తున్న సినిమా 'మిరాయ్‌'. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లోని షాట్స్,...

ఓటమి భయం… ఏపీలో వైసీపీ మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్..!?

ఏపీలో మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన అధికారులను ఈసీ మార్చేస్తుండటంతో జగన్ రెడ్డి దిక్కితోచని...

తీన్మార్ మల్లన్న స్టైలే వేరు !

వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close