ఒక్క మున్సిపాలిటీ ఓడినా ప‌ద‌వులు ఊడ‌తాయ్..!

పొర‌పాట్ల‌కు ఛాన్స్ లేదు. ఎక్క‌డ తేడా వ‌చ్చినా ఊరుకునేది లేదు. త‌ప్పు ఎవ్వ‌రు చేసినా క్ష‌మించే ప్ర‌స‌క్తి లేదు! తెరాస నేత‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ఇలానే ఉంద‌ని స‌మాచారం. మున్సిప‌ల్ ఎన్నిక‌లు నేప‌థ్యంలో జ‌రిగిన తెరాస విస్తృత స్థాయి స‌మావేశంలో సీఎం ఇలా స్పందించారు. ఒక్క మున్సిపాలిటీ ఓడినా మీ ప‌ద‌వి పోవ‌డం ఖాయ‌మంటూ మంత్రులంద‌రినీ హెచ్చ‌రించిన‌ట్టు తెలుస్తోంది. ఎక్క‌డా ఎలాంటి అసంతృప్తులూ ఉండ‌కూడ‌ద‌నీ, ఒక‌సారి అభ్య‌ర్థుల జాబితాను పార్టీ ప్ర‌క‌టించాక ఎవ్వ‌రూ మాట్లాడ‌కూడ‌ద‌నీ, ఎన్నిక‌ల్లో వెన్నుపోటు పొడిచే రాజ‌కీయం చేస్తే ఊరుకునేది లేద‌ని కూడా హెచ్చ‌రించారు!

ఎన్నిక‌ల బాధ్య‌త‌ల్ని ఎమ్మెల్యేల‌కే క‌ట్ట‌బెట్టిన‌ట్టు తెలుస్తోంది. అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ‌తోపాటు, అసంతృప్తుల బుజ్జ‌గింపులు కూడా వారే చెయ్యాల‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. తెలంగాణ‌లో తెరాస‌కు పూర్తి సానుకూల వాతావ‌ర‌ణం ఉంద‌నీ, భాజ‌పాగానీ కాంగ్రెస్ పార్టీగానీ పోటీ ఇచ్చే ప‌రిస్థితుల్లో లేవ‌ని నేత‌ల‌తో కేసీఆర్ చెప్పారు. తెరాస ప్ర‌భుత్వం ఇంత‌వ‌ర‌కూ చేసిన కార్య‌క్ర‌మాల‌ను పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయాల‌న్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లూ అన్నీ గెల‌వాల‌నీ… ఎక్క‌డ ఓడినా ఆ సంబంధింత ప్రాంతానికి చెందిన మంత్రికి ప‌ద‌వి ఊడ‌టం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించిన‌ట్టు తెలుస్తోంది.ఎమ్మెల్యేలంతా సొంత నియోజ‌క వ‌ర్గాల‌కు వెళ్లాల‌నీ, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో ఆత్మీయ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు.

ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన కేడ‌ర్ తోపాటు, మొద‌ట్నుంచీ ఉన్న తెరాస కేడ‌ర్ కీ మ‌ధ్య విభేదాలున్నాయని తెలిసిందే. ఇప్ప‌టికే కొన్ని నియోజ‌క వ‌ర్గాల్లో వ‌ల‌స ఎమ్మెల్యేలు, స్థానిక తెరాస నేత‌ల మ‌ధ్య విభేదాలు తెరమీద‌కి వ‌చ్చిన ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో ఆత్మీయ స‌మావేశాలు ఎంత‌వ‌ర‌కూ ప‌నిచేస్తాయో చూడాలి. ఇంకోటి… లోక్ స‌భ ఎన్నిక‌ల్ని సొంత పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు లైట్ గా తీసుకోవ‌డం వ‌ల్ల‌నే సారు కారు ప‌ద‌హారు ఎంపీ స్థానాలు అనే క‌ల సాకారం కాలేద‌న్న విశ్లేష‌ణ‌లు అప్ప‌ట్లో జ‌రిగాయి. అలాంటి నిర్ల‌క్ష్య ధోర‌ణి మ‌రోసారి నాయ‌కుల‌కు రాకూడ‌ద‌ని గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ వ‌ల్ల అర్థ‌మౌతున్న‌ది ఏంటంటే… ఒక‌టీ, ఈ స్థాయిలో క్లాస్ తీసుకుంటే త‌ప్ప తెరాస నేత‌లు చ‌క్క‌గా ప‌నిచేయ‌ర‌నే ప‌రిస్థితి ఇప్పుడుంద‌ని చెప్తున్న‌ట్ట‌యింది. రెండోది… ఎంత కాద‌నుకున్నా ప్ర‌తిప‌క్షాలు కూడా కొంత గ‌ట్టి పోటీ ఇచ్చే ప‌రిస్థితే ఉంద‌న్న అంచ‌నాలు కూడా సీఎంకి ఉన్న‌ట్టున్నాయ‌నే అనిపిస్తోంది. ఏదేమైనా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్ని అత్యంత ప‌క‌డ్బందీగా ఎదుర్కొనేందుకు తెరాస సిద్ధ‌మౌతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close