“పిచ్చి లం..” అంటూ కాలర్ ని లైవ్ లో బూతులు తిట్టిన శివాజీ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లో హాట్ టాపిక్ గా ఉన్న రాజధాని సమస్యపై ఏబీఎన్ ఛానల్ నిర్వహించిన లైవ్ షో లో పాల్గొన్న నటుడు శివాజీ, ఆ లైవ్ షో కి కాల్ చేసిన ఒక వ్యక్తిని “ఒరేయ్ పిచ్చి లం.. కొ*కా” అంటూ రాయజాలని పదజాలంతో దూషించడం ప్రేక్షకులని విస్మయపరిచింది. వివరాల్లోకి వెళితే..

శివాజీ నటుడిగా కంటే ఎన్నికలకు ఏడాది ముందు ఆపరేషన్ గరుడ టాపిక్ తో తెలుగు ప్రజల్లో బాగా పాపులర్ అయ్యారు. అయితే నిష్పాక్షికంగా మాట్లాడాల్సింది పోయి తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసేలా వ్యవహరిస్తున్నాడు అంటూ ఆయనపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ వద్ద కొన్ని షేర్లు కొనుగోలు చేశాడంటూ వచ్చిన ఆరోపణలు ఆ తర్వాత పర్యవసానాల కారణంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఆయనపై కేసు కూడా నడుస్తోంది. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాజధాని అమరావతి నుండి విశాఖకు మార్చడానికి దాదాపుగా నిర్ణయం తీసుకోవడంతో రాజధాని కి భూములు ఇచ్చిన రైతుల లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో ఆ సమస్యపై స్పందించడానికి శనివారం రాత్రి 9 గంటలకు లైవ్ షో లో పాల్గొనడానికి ఏబీఎన్ ఛానల్ కి వచ్చారు శివాజీ. తాను చెప్పినా వినకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి కి 151 సీట్లు కట్టబెట్టారని ఇప్పుడు ఆయన ఏం చేసినా ఆపగలిగే శక్తి ఎవరికీ లేదని, పైగా ప్రజలలో కూడా కులగజ్జి పెరిగిపోయిందని, వ్యాఖ్యానించారు.

అయితే ఇంతలో రాజధాని ప్రాంతానికి చెందిన రైతుని అంటూ లైవ్ షో కి కాల్ చేసిన ఒక కాలర్, తాను శివాజీ వాళ్ల ఊరికి చెందిన వాడినని, చెల్లి వరస అయ్యే అమ్మాయి ని లేపుకెళ్లి పోయిన శివాజీ లాంటి వ్యక్తులను ఇలా లైవ్ లో పిలవడం మంచిది కాదని అంటూ ఛానల్ యాంకర్ కి సూక్తులు చెప్పడం ప్రారంభించారు. కాలర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడానికి ఒక అర నిమిషం పట్టింది. ఆ లోగా, ఆ వ్యక్తి తాను చెప్పవలసింది చెప్పేశాడు. దీంతో ఖంగుతిన్న శివాజీ, ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక పోయారు. ” ఒరేయ్ పిచ్చి లం.. కొ..కా, నీవు వైకాపా పార్టీ ఆఫీసు నుండి మాట్లాడుతున్నావ్ అని నాకు తెలుసు రా, నీ లాంటి వాళ్లకు నేను భయపడను రా, మీ సమస్యల కోసం నేను మాట్లాడుతుంటే నా వ్యక్తిగత జీవితం మీద నోటికొచ్చినట్లు మాట్లాడతారా, మీ బతుకులు బాగుపడవు రా” అంటూ ఊగిపోయారు. ఆ కాల్ కట్ చేయవలసిందిగా యాంకర్ కి పురమాయించారు.

మొత్తం మీద రాజధాని విషయంలో పెట్టిన లైవ్ షో లో జరిగిన ఈ సంభాషణ ప్రేక్షకులని విస్మయపరిచింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణ ఏసీబీ – సీవీ ఆనంద్ మార్క్ !

బిల్ కలెక్టర్ నుంచి ఏసీపీ వరకూ ఎవరైనా లంచం తీసుకున్నారని ఫిర్యాదు వచ్చినా... తీసుకుంటున్నారని సమాచారం వచ్చినా ఏసీబీ అధికారులు వదిలి పెట్టడం లేదు. ట్రాప్ చేసి పట్టేసుకుంటున్నారు. ...

ఇంతకీ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ పేరు ఉందా ? లేదా ?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని అంతా ఆయనకు తెలుసుని ఈడీ కోర్టులో వాదించిందంటూ ఒక్క సారిగా ప్రచారం జరగడం సంచలనం రేపింది. కేసీఆర్ తాను అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర...

రాజకీయ యుద్ధం వదిలేసి… మోడీ సానుభూతిని కోరుకుంటున్నారా..?

రాజకీయాలన్నాక విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. వాటిని పట్టుకొని కూర్చుంటే రాజకీయాలు చేయలేం. లీడర్లు కూడా అదే పంథాను అనుసరిస్తుంటారు. వాటిని అస్సలు పరిగణనలోకి తీసుకోరు. కానీ, మోడీ తాజాగా ఓ ఛానెల్...

అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టలేని నిస్సహాయ స్థితిలో బీఆర్ఎస్..!!

టీఆర్ఎస్ పేరు మార్చడం ఎంత వ్యూహాత్మక తప్పిదమో బీఆర్ఎస్ కు తెలిసి వస్తోంది. అధికారం కోల్పోయిన వెంటనే ఈ తప్పిదాన్ని గుర్తించినప్పటికే రోజులు గడుస్తున్నా కొద్ది దాని ప్రభావం ఇప్పుడిప్పుడే అనుభవంలోకి వస్తోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close