చైతన్య : బ్యాంకర్లు డబ్బులు ప్రింట్ చేసి ఇచ్చేస్తారా .. సీఎం గారూ..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటి వెంట.. ఒక్కటే మాట వస్తోంది. అదే అప్పులు. ఆయన ఏ శాఖ అధికారులతో సమావేశమైనా… బ్యాంకర్లతో సమావేశమైనా.. అప్పులు పట్టుకు రండి.. అప్పులు ఇవ్వండి.. అనే మాటలు మాత్రమే ప్రధానంగాచెబుతున్నారు. ప్రాజెక్టుల నిర్మాణంపై అధికారులతో జరిపిన సమీక్షలో… రూ. లక్షన్నర కోట్ల అప్పులను సమీకరించాలని ఆదేశించారు. ఆ తర్వాత స్టేట్‌లెవల్‌ బ్యాంకర్ల కమిటీలోనూ… అప్పుల విషయంలో ఉదారంగా వ్యవహరించాలని.. తాము ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకున్నామని వివరించారు. ఆ ఉన్నతమైన లక్ష్యాలు నగదు పంపిణీ పథకాలే.

బ్యాంకుల దగ్గర లక్షల కోట్లు ఉంటాయా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుతో… బ్యాంకర్లు అప్పులు ఇవ్వడానికి సిద్ధపడటం లేదని.. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో తేలిపోతోంది. విద్యుత్ ప్రాజెక్టులను తాకట్టు పెట్టుకుని రూ. మూడు వేల కోట్లు అడినందుకు.. ఎస్బీఐ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎస్బీఐనే అలా అన్నదంటే.. ఇతర బ్యాంకులు రుణమిచ్చేందుకు సిద్ధం కావు. ఇస్తే.. గిస్తే.. వ్యక్తులు పర్సనల్ లోన్లు తీసుకుంటే.. ఇచ్చే వడ్డీ రేటుకు ఇస్తాయి. ఆ రేటుకు వందల కోట్లు తీసుకుంటే.. మునిగిపోవడానికి ఆరేడు నెలలు కూడా పట్టదు. కానీ ముఖ్యమంత్రి మాత్రం.. బ్యాంకర్ల దగ్గర డబ్బులు మూలుగుతూ ఉంటాయని.. వారు అంగీకరిస్తే.. ఎంత కావాలంటే.. అంత వచ్చి పడతాయని అనుకుంటున్నారు.

అప్పు ఇచ్చేయండి అని ప్రభుత్వం అడగగానే ఇచ్చేస్తాయా..?

సాధారణంగా ఓ బ్యాంక్.. సామాన్యుడికి రూ. లక్ష అప్పు ఇవ్వాలంటే.. ఎన్నో పత్రాలు తీసుకుంటుంది. ఆర్థిక పరిస్థితి ఏమిటి..? గతంలో ఎన్ని అప్పులు ఉన్నాయి..? ఎంత ఆదాయం వస్తుంది..? ఎన్ని ఈఎంఐలు కడుతున్నారు..? ఠంచన్‌గా ఈఎంఐలు కడుతున్నారా లేదా.. ఇవన్నీ పరిశీలిస్తుంది. దాని ప్రకారమే రుణం మంజూరుపై.. నిర్ణయం తీసుకుంది. ఇక వేల కోట్ల అప్పులు అడిగే ప్రభుత్వాల విషయంలో ఎందుకు పరిశీలన జరపదు. అలాంటి పరిశీలన జరిపితే.. ఏపీ ప్రభుత్వానికి మైనస్ రేటింగ్ వస్తోంది. గతంలో తీసుకున్న అప్పులను ప్రస్తుత సర్కార్ చెల్లించడానికి .. సందేహిస్తోంది. దాంతో బ్యాంకులు.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఆర్థిక ప్రణాళికల్లేని పథకాలతో ఒరిగేదేంటి..?

దేనికైనా ఓ నిర్దిష్ట ప్రణాళిక.. అంతకు మించిన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటేనే… ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయి. అవేమీ లేకుండా.. తనకు ఆలోచన వచ్చిందని… రాజధానిని విశాఖకు తరలింపు… ఆస్పత్రులు, స్కూళ్లకు పాతిక వేల కోట్లతో రంగులు వేయించడం.., రూ. 50వేల కోట్లతో వాటర్ గ్రిడ్ అంటూ ఇతర భారీ ఖర్చుతో కూడిన పథకాలు ప్రారంభించేసి.. నిధుల కోసం.. బ్యాంకర్ల వద్దకు వెళ్తే.. ఎలా మేలు కలుగుతుంది. ఓ పథకం ప్రారంభించాలంటే.. దానికితగ్గట్లుగా ఆర్థిక వనరుల ప్లాన్ కూడా ఉండాది. ముఖ్యమంత్రి అడిగితే బ్యాంకర్లు ఇచ్చేస్తారనుకుంటే.. పొరపాటే. మరి ఏపీ సీఎం దాన్ని ఎప్పుడు తెలుసుకుంటారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close