సీఆర్డీఏను రద్దు చేస్తే రైతులకు హక్కులేమీ ఉండవా..?

రాజధానికి భూములిచ్చిన రైతులపై జగన్మోహన్ రెడ్డి అతి పెద్ద బండ వేయబోతున్నారు. అదే సీఆర్డీఏ చట్టం రద్దు. ఈ చట్టం కిందనే.. భూములను రైతులు..రాజధాని కోసం ఇచ్చారు. ఈ చట్టం కింద .. వారికి ఎన్నో వేసులుబాట్లు ఉన్నాయి.అసలు ఈ చట్టం లేకుండా చేస్తే సరిపోతుందని.. ప్రభుత్వ పెద్దలకు .. సలహాదారుల నుంచి సలహా వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇరవయ్యే తేదీన జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో సీఆర్డీఏ చట్టాన్ని కూడా.. రద్దు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. రాజధాని పరిధి అభివృద్ధి కోసం.. సీఆర్డీఏను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కోర్టుల్లో పిటిషన్లు వేసిన రైతులు కూడా.. ఈ చట్టంలోని అంశాలనే ప్రధానంగా చూపిస్తున్నారు.

సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయడం అంత తేలిక కాదన్న చర్చ.. కూడా అధికారవర్గాల్లో నడుస్తోంది. కొన్ని వేల ఎకరాలను రైతుల వద్ద నుంచి సీఆర్డీఏ సమీకరించింది. ఇలాంటి సమయంలో.. ఆ చట్టాన్ని రద్దు చేయాలంటే.. ఆ చట్టం ద్వారా చేసిన పనులు.. చేపట్టిన కార్యకలాపాలకు సంబంధించి.. బాధితులకు సంపూర్ణ న్యాయం చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా.. ఏకపక్షంగా చట్టం రద్దు చేస్తే.. అది కోర్టుల్లో నిలబడదు. పైగా అలా చేయడం చట్ట విరుద్ధమవుతుంది. ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా.. చట్టబద్ధంగా.. సీఆర్డీఏ చట్టాన్ని ఎలా రద్దు చేయాలన్నదానిపై.. ఇప్పుడు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన వారు.. కసరత్తు పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు.

సీఆర్డీఏ .. అనేక అంతర్జాతీయ సంస్థలోనూ ఒప్పందాలు కుదుర్చుకుంది. రైతుల వద్ద భూములు తీసుకోవడం మాత్రమే కాదు.. అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇస్తామని చెప్పి.. ప్రజలు, ఎన్నారైల వద్ద… డబ్బులు వసూలు చేసింది. హ్యాపీనెస్ట్ పేరుతో ప్రాజెక్ట్ కూడా.. ప్రారంభించారు. అలాగే అప్పులు కూడా తీసుకున్నారు. ఇప్పుడు.. సీఆర్డీఏను రద్దు చేయాలంటే.. ప్రభుత్వం వారికి భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. పైగా.. సీఆర్డీఏ చేసుకున్న అభివృద్ధి ఒప్పందాలన్నింటీలోనూ.. అమరావతిని రాజధానిగా పేర్కొన్నారు. ఇప్పుడు రాజధానిగా లేకపోతే.. ఒప్పందాలు చేసుకున్న ప్రతి ఒక్కరు.. రైతులతో సహా… కోర్టుకెళ్లేందుకు హక్కులు ఉన్నాయి. అందుకే అనుకున్నంత సులువుగా..సీఆర్డీఏను రద్దు చేయడం సాధ్యం కాదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close