కమ్మోళ్లకు రెండు రాజధానులన్న కొడాలి నాని..!

కమ్మ వాళ్లకి ఇక రెండు రాజధానులని.. తీర్మానించారు ఏపీ మంత్రి కొడాలి నాని. అటు అమరావతిని ఇటు.. విశాఖను ఆయన కమ్మవాళ్ల కేటగిరిలో వేశారు. ఓ కులంపై కక్షతోనే… రాజధానిని మారుస్తున్నారన్న విమర్శలకు.. అదే కులానికి చెందిన కొడాలి నానితో జగన్మోహన్ రెడ్డి ఎదురుదాడి చేయించారు. ఆ పాత్రను కొడాలి నాని.. తనదైన శైలిలో పోషించారు. అమరావతిలో రాజధాని పెడితే కమ్మ కులం అభివృద్ధి చెందుతుందని పెట్టారా చంద్రబాబుపై కులపరమైన విమర్శలతో ప్రారంభించి.. అనర్ఘళంగా కుల ప్రసంగం చేశారు. కులంపై ద్వేషంతో రాజధానిని తరలిస్తున్నామని ప్రచారం చేశారని.. రాజధాని తరలింపు వల్ల కమ్మవారికి ఎలాంటి ఇబ్బంది లేదని భరోసా ఇచ్చారు. విశాఖలో కమ్మ కులం వారికే అధిక వ్యాపారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. జగన్‌కు కులాల ఆలోచన ఉంటే రాజధాని రాయలసీమ ప్రాంతానికి వెళ్లేదని.. అలా లేదు కాబట్టే విశాఖలో పెడుతున్నారన్నారు. ఇప్పుడు కమ్మ కులం వారికి రెండు రాజధానులని చెప్పుకొచ్చారు.

కొడాలి నాని.. రాజధాని తరలింపు విషయంలో వస్తున్న విమర్శలను.. తిప్పికొట్టేందుకు.. కాస్త వింత మార్గాన్ని ఎంచుకున్నారు. అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉందని చంద్రబాబు అన్నారు.. రాజధాని ఎక్కడ పెడితే రాష్ట్రాభివృద్ధికి ఉపయోగమో చూడాలి కానీ మధ్యలో ఉండటం కాదని చెప్పుకొచ్చారు. ఢిల్లీ… భారతదేశానికి మధ్యలో ఉందా అని లాజిక్ కూడా లాగారు. అసలు అమరావతిని పాడుపెట్టేశారు.. ఇది చంద్రబాబు అమరావతి అనితేల్చారు. అసెంబ్లీలో జగన్‌ అమరావతికి ఒప్పుకున్నాడని అంటున్నారని.. మీరు కట్టకపోతే జగన్‌ కడతానని చెప్పారా అని చెప్పుకొచ్చారు. అమరావతి పెట్టకముందే కృష్ణా, గుంటూరు జిల్లాలు అభివృద్ధిలో ఉన్నాయని.. తమకు ఇక అభివృద్ధి అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు. విశాఖలో 70 వేల కోట్ల పెట్టుబడులు పెడితే అభివృద్ధి చెందుతుందని అన్నారు .. ఆ పెట్టుబడులను తెచ్చి అమరావతిలో పెట్టి అభివృద్ధి చేయండి అని.. కొడాలి విచిత్రమైన సవాల్ చేశారు. అధికారలో ఉండి.. ప్రతిపక్షంలో ఉన్న వారిని సవాల్ చేసి.. అందర్నీ ఆశ్చర్యపరిచారు.

వైఎస్ మరణంపై మాట్లాడి… టీడీపీ సభ్యులతోనూ… కాస్త తేడా అనిపించుకున్నారు కొడాలి నాని. సందర్భం లేకపోయినా.. వైఎస్ మరణం ప్రస్తావన తీసుకు వచ్చారు. వైఎస్‌ మరణం గురించి లేనిపోనివి మాట్లాడుతున్నారని .. వైఎస్‌ చనిపోయిన తర్వాత కూడా మన మధ్య బతికే ఉన్నారని చెప్పుకొచ్చారు. వైఎస్‌లాంటి మరణం కావాలని దేవుడిని కోరుకుంటానని వ్యాఖ్యానించారు. వైఎస్‌ చేసిన గొప్ప పనుల వల్లే జగన్‌కు సీఎం అయ్యారని 70 ఏళ్లు వచ్చినా తన కొడుకును గెలిపించుకోలేని చంద్రబాబు కంటే.. వైఎస్‌ చావు వందరెట్లు బెటర్‌ అని ప్రసంగించి.. జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బంది ఫీలయ్యేలా ప్రసంగించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close