సీనియర్‌ తమ్మినేని కంటే జూనియర్‌ జగన్‌ మెచ్యూర్డ్‌…!

ప్రాంతీయ పార్టీల్లో సహజంగానే ‘స్వామి భక్తి’ ఎక్కువగా ఉంటుంది. మామూలుగానే పార్టీ అధినేత పట్ల కొందరు మరీ అతి వినయంగా ఉంటారు. ఆ అధినేతే ముఖ్యమంత్రి అయ్యాడనుకోండి ఇక చెప్పక్కర్లేదు. నడుము, వెన్నెముక పూర్తిగా వంచేస్తారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అలా వంగిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. కొత్తగా అప్పుడే రాజకీయాల్లోకి ప్రవేశించినవారు అలా చేస్తారంటే వారు ‘ముదుర్లు’ కాదు కాబట్టి సరిపెట్టుకోవచ్చు. కాని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నవారు, ఎంతో రాజకీయ అనుభవం ఉన్నవారు కూడా ముఖ్యమంత్రి ముందు వంగిపోతున్నారంటే ఏమనుకోవాలి?

ఇందుకు ఉదాహరణ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం. ఈయన స్పీకర్‌ కాగానే ఆ పదవికున్న గౌరవానికి భంగం కలిగించాడు. దాని పరువు తీసి వదలిపెట్టాడు. ఈయన చాలా సీనియర్‌. చాలా గ్యాప్‌ తరువాత వైఎస్‌ జగన్‌ పుణ్యమా అని స్పీకరయ్యాడు. స్పీకర్‌ పదవిలో ఉండి కూడా పార్టీకి అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఉండలేకపోతున్నాడు. పబ్లిక్‌ మీటింగుల్లో కూడా ప్రాంతీయ అభిమానంతో మాట్లాడుతూవుంటాడు. బూతులు మాట్లాడటానికి కూడా జంకడు. స్పీకరు పదవిలో ఉండి కూడా జగన్‌కు భజన చేస్తుంటాడు.

వైకాపా కారణంగా ఈయన ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి, జగన్‌ కారణంగా స్పీకర్‌ అయ్యాడు కాబట్టి జగన్‌ పట్ల ప్రేమ, వినయం ఉండొచ్చు. దాన్ని కాదనలేం. అలా ఉండటం కూడా తప్పు కాదు. కాని తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాననే సంగతి గుర్తుంచుకోవాలి. సభను నడిపించే స్పీకరుకు సర్వాధికారాలు ఉంటాయి. ఈ సంగతి ఆయనే చెప్పాడు. ఆ సీట్లో కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రితో సహా మంత్రులను, ఎమ్మెల్యేలను ఆదేశించే అధికారం ఆయనకు ఉంటుంది. అంతే తప్ప వారిని బతిమాలాల్సిన అవసరం ఉండదు. ఈరోజు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి టీడీపీ సాగించిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ గురించి వివరించాడు.

అమరావతి గ్రామాల్లో ఎవరెవరు ఎంతెంత భూములు కొనుగోలు చేశారో, ఎలా అవినీతికి పాల్పడ్డారో వివరించాడు. అందరి పేర్లూ చదివాడు. గతంలో ఇదంతా అసెంబ్లీలో తెలియచేసినా మూడు రాజధానులు బిల్లు సందర్భంగా మరోసారి వివరించాడు. మంత్రి ఎపిసోడ్‌ ముగిశాక స్పీకర్‌ సీఎం జగన్‌ను ఉద్దేశించి తనదో రిక్వెస్టు, అభ్యర్థన అంటూ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ మీద విచారణ జరిపించాలని కోరాడు. ఇది తన అభ్యర్థన అని తమ్మినేని నొక్కి వక్కాణించాడు. వెంటనే జగన్‌ లేచి ‘మీ ఆదేశాలను తప్పకుండా అమలు చేస్తాను’ అన్నాడు.

ఇక్కడ తేడా ఏమిటంటే స్పీకర్‌ చాలా వినయంగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ జరిపించాలని అభ్యర్థించగా, జగన్‌ మాత్రం ‘మీ ఆదేశాలను’ అన్నాడు. స్పీకర్‌ తన పదవిని తక్కువ చేసుకొని అభ్యర్థించగా, జగన్‌ ఆ పదవి ఔన్నత్యాన్ని గౌరవించి తమ్మినేని చెప్పినదాన్ని ‘ఆదేశం’గా పరిగణించారు. అదీ జగన్‌ కనబరిచిన మెచ్యూరిటీ. పరిణతి. ఒక దశలో తనకు సర్వాధికారాలు ఉన్నాయంటూ ఊగిపోయిన స్పీకర్‌ జగన్‌కు అంత వినయవిధేయతలతో చెప్పడం ఎందుకు? స్పీకరుగా ఆయనకు సర్వాధికారాలు ఉన్నాయి కాబట్టి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ విచారణ జరిపించమని జగన్‌ను ఆదేశించవచ్చు. అతి వినయం చూపించేవారిని ఏదో అంటారే అలా ఉంది స్పీకరు తీరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇక రైతుల ఉద్యమంపై ఉక్కుపాదమేనా..!?

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులుచేస్తున్న ఉద్యమం హింసాత్మకమయింది. రిపబ్లిక్ డే రోజున రైతు సంఘాలు చేపట్టిన ర్యాలీ దారి తప్పింది. కొంత మంది ఎర్రకోటపైకి ఎక్కి సంబంధం లేని జెండాలు ఎగురేశారు. మరికొంత...

తెలంగాణ ఉద్యోగులకు అన్‌ ” ఫిట్‌మెంటే “

తెలంగాణ ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న వేతన సవరణ నివేదిక వారికి షాకిచ్చింది. కేవలం 7.5శాతం ఫిట్‌మెంట్ మాత్రమే సిఫార్సు చేసింది. ఉద్యోగ సంఘాలు కనీసం 30 నుంచి 40శాతం...

కేరళ, బెంగాల్ గవర్నర్లు అలా.. .. ఏపీ గవర్నర్ ఇలా..!

గవర్నర్ రాజ్యాంగాధిపతి. రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగితే జోక్యం చేసుకోవాల్సింది ఆయనే. ఆయనకు అలాంటి అధికారాలు ఉన్నాయి కాబట్టే... బెంగాల్, కేరళ వంటి చోట్ల.. ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. కేంద్రానికి ఫిర్యాదులు పంపుతున్నారు....

ద‌ర్శ‌కేంద్రుడి ఓల్డ్ స్కూల్ స్టైల్‌లో `ఓ బాబూ..`

రాఘ‌వేంద్ర‌రావు... న‌టుడిగా మేక‌ప్ వేసుకుని తొలిసారి కెమెరా ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. త‌నికెళ్ల భ‌ర‌ణి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `ఓ.. బాబూ` అనే పేరు ప‌రిశీల‌న‌లో వుంది. ఈ చిత్రానికి...

HOT NEWS

[X] Close
[X] Close