హ‌రీష్ శంక‌ర్ ఏం చేస్తున్నాడు?

గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌తో ఓ సూప‌ర్ హిట్టు కొట్టాడు హ‌రీష్ శంక‌ర్‌. ఆ త‌ర‌వాత త‌ను చేయ‌బోయే సినిమాపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ క్లారిటీ రాలేదు. అయితే… హ‌రీష్ దృష్టి అక్కినేని హీరోల‌పై ప‌డింద‌ని టాక్‌. నాగ‌చైత‌న్య‌తోగానీ, అఖిల్‌తో గానీ సినిమా చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడ‌ని తెలుస్తోంది. నిజానికి బిగ్ లీగ్‌లో చేరి, స్టార్ హీరోల‌తో సినిమాలు చేయాల‌ని ఆశ ప‌డుతున్నాడు హ‌రీష్‌. అయితే ఆయా హీరోలంతా ఫుల్ బిజీగా ఉన్నారు. వాళ్ల‌తో సినిమాలు చేయాలంటే ఏళ్ల‌కు ఏళ్లు ఆగాల్సిందే. అయితే హ‌రీష్ ఈసారి అంత రిస్కు తీసుకోద‌ల‌చుకోలేదు. ఈలోగా ఓ సినిమా చేయాల‌న్న‌ది ప్లాన్‌. అయితే చైతూకీ అస్స‌లు ఖాళీ లేదు. శేఖ‌ర్ క‌మ్ముల సినిమాతో త‌ను బిజీ. ఆ త‌ర‌వాత బంగార్రాజు ఉండొచ్చు. అఖిల్ అయితే ఈజీగా దొరికేయొయ్చు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌ర‌వాత అఖిల్ ఏ సినిమా ఫిక్స్ కాలేదు. అందుకే. అఖిల్‌తో ఓకే అయ్యే ఛాన్సులు ఎక్కువ క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close