విజ‌య‌శాంతి ష‌ర‌తులు మామూలుగా లేవు

స‌రిలేరు నీకెవ్వ‌రు తో 13 ఏళ్ల త‌ర‌వాత రీ ఎంట్రీ ఇచ్చింది విజ‌య‌శాంతి. ఆ సినిమాకు త‌ను ప్ల‌స్ అయ్యింది. త‌న‌కు ఆ సినిమా ప్ల‌స్ అయ్యింది. ఈ సినిమాకి గానూ విజ‌య‌శాంతికి రూ.3 కోట్ల వ‌ర‌కూ ముట్టిన‌ట్టు స‌మాచారం. అడిగినంత పారితోషికం ఇవ్వ‌డానికి ఇప్ప‌టికీ నిర్మాత‌లు రెడీగానే ఉన్నారు. కాక‌పోతే… విజ‌య‌శాంతి ష‌ర‌తులు వింటేనే మైండ్ బ్లాంక్ అయిపోతోంద‌ట‌.

మ‌హేష్‌బాబులాంటి స్టార్ సినిమాల్లోనే చేస్తాన‌న్న‌ది విజ‌య‌శాంతి మొట్ట‌మొద‌టి ష‌ర‌తు. యంగ్ హీరోలు, చిన్నా చిత‌కా సినిమాలైతే అస‌లు క‌థే విన‌న‌ని చెబుతోంద‌ట‌. అంతే కాదు.. ఏ హీరోతో సినిమా చేస్తే, ఆ హీరోకి ఇచ్చే కంఫ‌ర్ట్స్ త‌న‌కూ కావాలి అంటోంద‌ట‌. ప్ర‌చారంలో త‌ను కూడా ప్ర‌ముఖంగా క‌నిపించాల‌ని, ముఖ్యంగా పోస్ట‌ర్ల‌లో హీరోతో పాటు స‌మాన‌మైన ప్రాధాన్యం ఇవ్వాల‌ని అంటోంద‌ట‌. త‌న పాత్ర నిడివి ముందు ఎంత చెబితే అంతే ఉండాల‌ని, తీసిన సన్నివేశాలు ఒక్క‌టీ తొల‌గించ‌కూడ‌ద‌ని చెబుతోంద‌ట‌. ఈ ష‌ర‌తుల‌న్నింటికీ ఒప్పుకుంటే… అప్పుడు క‌థ వింటుంద‌ట‌. విజ‌య‌శాంతి అడిగే పారితోషికం కంటే, ఈ ష‌ర‌తులే క‌ఠినంగా ఉన్నాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close