లుక్కుతోనే హింట్ ఇచ్చేసిన వెంకీ

రీమేకులంటే వెంక‌టేష్‌కి ఎంతిష్ట‌మో..?  అగ్ర క‌థానాయ‌కుల్లో ఆయ‌న చేసిన‌న్ని రీమేకులు ఎవ‌రూ చేయ‌లేదు. వాటితోనే హిట్లు కూడా కొట్టాడు. ఈసారి ఆయ‌న దృష్టి `అసురన్‌`పై ప‌డింది. త‌మిళంలో ధ‌నుష్ చెల‌రేగి న‌టించిన సినిమా అది. తెలుగులో వెంకీ చేజిక్కించుకున్నాడు. ఈ చిత్రానికి `నార‌ప్ప‌` అనే మాసీ టైటిల్ పెట్టాడు శ్రీ‌కాంత్ అడ్డాల. దాంతో పాటు లుక్ కూడా వ‌దిలారు.

త‌మిళంలో ధ‌నుష్ లుక్‌కీ, వెంకీ లుక్ కీ అస్స‌లు తేడా లేదు. త‌ల‌మీద చుట్టుకున్న కండువాతో స‌హా. కండువా రంగు కూడా మార్చ‌డానికి వెంకీ ఇష్ట‌ప‌డ‌లేదు. దాంతో… ఈ సినిమా ఎలా ఉండ‌బోతోందో ఓ అంచ‌నాకు రావొచ్చు. మార్పులు, చేర్పులూ ఏమాత్రం ఉండ‌వ‌ని, ఉన్న‌ది ఉన్న‌ట్టుగానే చూపించ‌డానికి అటు హీరో, ఇటు ద‌ర్శ‌కుడు ఇష్ట‌ప‌డుతున్నార‌న్న‌ది అర్థం అవుతోంది. తమిళ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే ఎమోష‌న్లు వేరు, ఇక్క‌డి ప‌ద్ధ‌తులు వేరు. ఈ విష‌యం వెంకీకి తెలియంది కాదు. మరి దాన్ని ఎలా బాలెన్స్ చేస్తాడో చూడాలి. అస‌లు ఈ క‌థ‌కి శ్రీ‌కాంత్ అడ్డాల స‌రైన ద‌ర్శ‌కుడేనా?  అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా ఫాలో అయిపోవాల్సివ‌చ్చిన‌ప్పుడు ద‌ర్శ‌కుడు ఎవ‌రైతే ఏమిటి? ఆ క్లారిటీ ఇప్పుడు వ‌చ్చి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close