ప్రభుత్వ భవనాలపై పార్టీల రంగులన్నీ తొలగించాల్సిందేనన్న హైకోర్టు..!

పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాలు ప్రభుత్వానివి.. కార్యాలయాలకు పార్టీ రంగులు ఉండకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున రంగులు తొలగించాలనిఆదేశించింది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని …కౌంటర్‌ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి ఐదో తేదీకి వాయిదా వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రభుత్వ భవనానికి వైసీపీ పార్టీ రంగులు వేయడం ప్రారంభించారు. ఫలానా రంగులు వేయాలని అధికారులు స్వయంగా ఆదేశాలు జారీ చేశారు.

ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా… ఉన్నతాధికారుల ఆదేశం మేరకు.. పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయాలకు.. పార్టీ రంగులు వేశారు. అప్పుడే… ఎన్నికల కోడ్ ప్రకారం.. స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే… రంగులన్నింటినీ తొలగించాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమయింది. అయితే.. ప్రభుత్వం మాత్రం.. అలాంటిదేమీ పట్టించుకోలేదు. రంగుల వేయడం అనే ప్రక్రియను కొనసాగించింది. ఈ రంగుల కోసం… దాదాపుగా పదహారు వందల కోట్లు ఖర్చు చేసినట్లుగా ప్రచారం జరిగింది. అధికారిక లెక్కలను మాత్రం ప్రభుత్వం ఇంత వరకూ బయటపెట్టలేదు.

కొద్ది రోజుల క్రితం.. గుంటూరు జిల్లా పల్లపాడులోని ఓ స్కూల్‌కు రంగులు వేయడంపై.. ఆ గ్రామస్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడే హైకోర్టు తొలగించాలని ఆదేశించింది. ఇప్పుడు.. అలాంటి తీర్పు.. రాష్ట్రం మొత్తానికి వర్తింప చేస్తూ.. ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు.. పంచాయతీ భవనాలన్నింటికీ తెలుపు రంగు కోసం బడ్జెట్ కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close