భాజ‌పా, కాంగ్రెస్ కండువాలు మార్చుకోవాల‌న్న కేటీఆర్!

మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఘ‌న విజ‌యం త‌రువాత‌.. మ‌రోసారి రెండు జాతీయ పార్టీల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ముఖ్య‌మంత్రి కేసీఆర్ విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వం ఆవ‌శ్య‌క‌త దేశానికి ఉంద‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా తెరాస వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మొత్తం 127 మున్సిపాలిటీల్లో 119 కైవ‌సం చేసుకున్నామ‌నీ, ఇత‌ర పార్టీల‌కు అంద‌నంత దూరంగా తెరాస ఉంద‌ని కేటీఆర్ అన్నారు. ఎక్స్ అఫిషియో స‌భ్యుల ఓటింగ్ గురించి మాట్లాడుతూ… ఉన్న‌దాన్నే వాడుకున్నామ‌నీ, దీన్లో త‌ప్పేముంద‌న్నారు. వారి ఓటును వినియోగించుకునే అవ‌కాశం చ‌ట్ట‌బ‌ద్ధంగా పార్టీకి ఉంది క‌దా అన్నారు. రెబెల్స్ గురించి మాట్లాడుతూ… అలాంటివారు కొన్ని చోట్ల గెలిచినా, వారి అవ‌స‌రం లేకుండానే కొన్ని మున్సిపాలిటీలు కైవ‌సం చేసుకున్నామ‌న్నారు.

మా ప్ర‌త్య‌ర్థులు చాలా చోట్ల తిప్ప‌లుప‌డ్డార‌నీ, చాలా చోట్ల కుమ్మ‌క్క‌య్యార‌న్నారు కేటీఆర్. కాంగ్రెస్, భాజ‌పాలు క‌లిసి స్థానాలు పంచుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. మ‌క్త‌ల్ లో భాజ‌పా ఛైర్మ‌న్ అయితే, కాంగ్రెస్ మ‌ద్ద‌తు ఇచ్చింద‌నీ, మ‌ణికొండ‌లో భాజ‌పాకి ఛైర్మ‌న్, కాంగ్రెస్ కి ఉపాధ్య‌క్ష‌ ప‌ద‌వి, తుర్క‌యాంజ‌ల్ లో కూడా ఇలానే స‌ర్దుకున్నార‌న్నారు. పేరుకేమో ఢిల్లీ పార్టీలు, చేసేవ‌న్నీ సిల్లీ ప‌నులు అన్నారు. జాతీయ పార్టీలైన ఈ రెండూ, ఒక ప్రాంతీయ పార్టీ తెరాస‌ను ఎదుర్కొన‌లేక‌పోయాయ‌న్నారు. ఇదొక అప‌విత్ర అవ‌గాహ‌న అని ముందే చెప్పామ‌నీ, ఇప్పుడు అదే బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. మొన్న‌టిదాకా టీడీపీ – కాంగ్రెస్ కలిశాయ‌నీ, ఇప్పుడు కాంగ్రెస్ – భాజ‌పా క‌లిశాయ‌న్నారు. తెరాస దెబ్బ‌కు ఈ చిత్రాలు చూస్తున్నామ‌న్నారు. ఒక‌రేమో త‌మ‌ను కాంగ్రెస్ ఏజెంట్ అంటార‌నీ, మ‌రొక‌రు మేం భాజ‌పా బీ టీమ్ అంటార‌నీ.. ఇవాళ్ల ఎవ‌రు ఎవ‌రికి ఏజెంటో తేలింద‌న్నారు. ఆ రెండు పార్టీలు కండువాలు మార్చుకోవాలన్నారు. ఒక మున్సిపాలిటీ కోసం రెండు జాతీయ పార్టీలు పాకులాడే పరిస్థితి వచ్చిందన్నారు. ఢిల్లీలో తు కిత్తా మే కిత్తా అని అరుచుకునే పార్టీలు ఇవాళ్ల తెరాస దెబ్బ‌కి ఫెవిక్విక్ బంధం పెట్టుకున్నాయ‌న్నారు.

కాంగ్రెస్, భాజ‌పా… స‌మీప భ‌విష్య‌త్తులో ఈ రెండు పార్టీలూ మేం వేర్వేరు అని బ‌లంగా చెప్పుకుంటే త‌ప్ప తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మ‌రు అనే స్థాయిలో కేటీఆర్ విమ‌ర్శించారు. ప‌నిలోప‌నిగా జాతీయ పార్టీలు రెండూ తెలంగాణ‌కు అవ‌స‌రం లేద‌న్న‌ది కూడా అదే స్థాయిలో బ‌లంగా చెబుతూ, ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల క‌ల‌కు అనుగుణంగా… తాజా ప‌రిస్థితిని కేటీఆర్ మార్చి విశ్లేషించే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close