ఇండ్ర‌స్ట్రీకి బ‌న్నీ స్పెష‌ల్ పార్టీ

అల్లు అర్జున్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఆల్ టైమ్ ఇండ్ర‌స్ట్రీ రికార్డ్ (నాన్ బాహుబ‌లి 2) సాధించాడు క‌దా. పైగా భీక‌ర‌మైన పోటీని ఎదుర్కొని, త‌న సినిమాని బాక్సాఫీసు రికార్డు చిత్రాల స‌ర‌స‌న నిల‌బెట్ట‌గ‌లిగాడు. అందునా… ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ లాంటి ఫ్లాపు త‌ర‌వాత‌, ధీటైన హిట్టుతో రేసులోకి వ‌చ్చేశాడు. అందుకే అంత ఆనందం. ఇప్పుడు ఈ సంతోషాన్ని ప‌రిశ్ర‌మ‌తోనూ పంచుకోబోతున్నాడు. త్వ‌ర‌లోనే ఓ భారీ పార్టీని ప్లాన్ చేశాడు బ‌న్నీ. ప‌రిశ్ర‌మ‌లోని త‌న స‌న్నిహితుల‌కు, హీరోల‌కు, నిర్మాత‌ల‌కు, మీడియాకూ ఓ ప్ర‌త్యేక‌మైన విందు ఇవ్వ‌బోతున్నాడు. ఈ పార్టీలో ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్ లాంటి హీరోలూ పాల్గొన‌బోతున్నారు. ప‌క్క రాష్ట్రాల నుంచి కూడా హీరోల్ని ఆహ్వానిస్తాడ‌ని తెలుస్తోంది. ఈ పార్టీ అయ్యాక‌.. మీడియాకు ప్ర‌త్యేకంగా మ‌రో పార్టీ ఇవ్వబోతున్నాడు. ఈ రెండు పార్టీలూ గ్రాండ్‌గా, ‘అల వైకుంఠ‌పుర‌ములో’ హిట్టు స్థాయికి త‌గ్గ‌ట్టుగానే ఉంటుంద‌ట‌. మ‌రి ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ టీమ్ ఏం చేస్తుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లిన పట్టాభి !?

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాల్దీవ్స్ వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  ఆయన విమానం ఎక్కినప్పటి నుండి దిగిన వరకూ ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఓ పార్టీ...

‘గీతా’లో మరో సంతకం

'బొమ్మరిల్లు’ సినిమా దర్శకుడు భాస్కర్ జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమానే ఆయన ఇంటిపేరు అయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ త్వరగానే వచ్చేసింది. అయితే...

విష్ణు నిర్ణ‌యం బాగుంది.. కానీ!?

`మా` అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు మంచు విష్ణు. వీలైనంత త్వ‌ర‌గా త‌న మార్క్ ని చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. `మా` బై లాస్ లో కొన్నింటికి మార్చాల‌న్న‌ది విష్ణు ఆలోచ‌న‌. ...

ఏపీ చీకట్లే తెలంగాణ వెలుగులకు సాక్ష్యాలన్న కేసీఆర్

టీఆర్ఎస్ అధినేతగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తన ప్రసంగంలో .. తెలంగాణ అభివృద్ధిని.. ఏపీతో పోల్చి విడిపోవడం వల్ల ఎంత ప్రగతి సాధించామో వివరించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి...

HOT NEWS

[X] Close
[X] Close