డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాల్సిందేనంటున్న వైసీపీ ఎంపీ..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రోటోకాల్ వివాదం ముదురుతోంది.  పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో… ఎంపీలకు ఎలాంటి గౌరవం దక్కలేదు. ఎమ్మెల్యేలు.. చిన్న స్థాయి అధికారులు కూడా.. వేదిక మీద కూర్చుంటే.. ఎంపీలు కింద కూర్చోవాల్సి వచ్చింది. తాము కింద కూర్చోవడం ఏమిటని… ఎంపీ రఘురామకృష్ణంరాజు.. లేచి వెళ్లి వేదికపై కూర్చున్నారు. అయితే.. మంత్రి ఆళ్ల నాని.. రఘురామకృష్ణంరాజును కిందకు వెళ్లి కూర్చోవాలని.. మెహం మీదనే చెప్పేశారు. దాంతో.. రఘురామకృష్ణంరాజు ఫీలయ్యారు. సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. మరో ఇద్దరు ఎంపీలు కూడా ఆయన బాటే పట్టారు.

ఈ విషయాన్ని రఘురామకృష్ణంరాజు ఇంతటితో వదిలి పెట్టాలనుకోవడం లేదు.  ప్రోటోకాల్ ప్రకారం అధికారుల కంటే ఎంపీలే ఎక్కువని..తనను అవమానించిన డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తనకు జరిగిన ఈ అవమానం.. తనకు ఓట్లు వేసిన ప్రజలకు జరిగిన అవమానంగా భావిస్తున్నానన్నారు. అధికారులే ఎంపీల కంటే ఎక్కువని.. నిరూపించినా… మంత్రి ఆళ్ల నాని క్షమాపణలు చెప్పకపోయినా.. ఇక నుంచి ఎలాంటి సమావేశాలకు తాను వెళ్లబోనని స్పష్టం చేశారు. ఈ వివాదంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా రఘురామకృష్ణంరాజు వెంట నిలిచారు.

వైసీపీలో ఎంపీలకు ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదని ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో విజయసాయిరెడ్డికే నేరుగా.. తమ ఆవేదన చెప్పుకున్నారు. ఎమ్మెల్యేలకే సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని.. వారు చెప్పిన పనలే చేయాలని.. ఆదేశిస్తున్నారని.. ఎంపీల మాట ఎక్కడా చెల్లుబాటు కావడం లేదని.. అసంతృప్తి వ్యకం చేశారు. తాను జగన్ తో మాట్లాడుతానని.. అప్పటికప్పుడు విజయసాయిరెడ్డి సర్దిచెప్పారు కానీ..  క్షేత్ర స్థాయిలో మార్పులేమీ లేకపోవడంతో… ఒక్కొక్కరు బయట పడుతున్నారు. ఈ వివాదం.. వైసీపీలో ఎంపీలు వర్సెస్ పార్టీ అన్నట్లుగా మారే పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close