‘జానూ’.. ఫ‌స్ట్ హీరో బ‌న్నీనా?

’96’ సినిమాని రీమేక్ చేయాల‌నుకున్న‌ప్పుడు దిల్ రాజులో ఎన్ని ఆలోచ‌న‌లో. త్రిష పాత్ర కోసం స‌మంత‌ని ముందే ఫిక్స‌యిపోయాడు దిల్ రాజు. అయితే… విజ‌య్‌సేతుప‌తి పాత్ర కోసం మాత్రం చాలా ఆప్ష‌న్లు రాసుకున్నాడు. అందులో… అల్లు అర్జున్ పేరు కూడా ఉంది. బ‌న్నీకి `96` సినిమాని కూడా చూపించాడు దిల్ రాజు. ఆ సినిమా న‌చ్చితే గ‌నుక‌.. బ‌న్నీతో లాగించేద్దామ‌ని అనుకున్నాడు. కానీ బ‌న్నీ మాత్రం సినిమా చూసి `బాగుంది.. క్యారీ ఆన్‌..` అని చెప్పాడు గానీ, ‘నేను చేస్తా’ అని మాట ఇవ్వ‌లేదు. దాంతో చివ‌రి ఆప్ష‌న్‌గా శ‌ర్వానంద్‌ని అనుకుని, శ‌ర్వానంద్‌తో ఓకే చేయించుకున్నాడు దిల్ రాజు. `బ‌న్నీకి చూపించింది స‌ల‌హా కోస‌మే. అయితే తానని ఈ సినిమా విప‌రీతంగా న‌చ్చేస్తే.. చేస్తాను అని అంటే.. నాకు హ్యాపీనే క‌దా, అందుకే ఓ రాయి వేశా` అంటూ ఆ సీక్రెట్ మీడియా ముందు కూడా ఒప్పేసుకున్నాడు. అంత‌కు ముందే ఈ సినిమాని నానికి చూపిస్తే… ‘అస‌లు తెలుగులో ఈ సినిమా చేయొద్దు’ అంటూ స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. ఇక హీరోగా ఎందుకు ఒప్పుకుంటాడు? మ‌రి ఈ ఇద్ద‌రినీ దాటుకుని వ‌చ్చిన సినిమాని శ‌ర్వానంద్ ధైర్యం చేసి, చేసేశాడు. మ‌రి రిజ‌ల్ట్ మాటేమిటో తెలియాలంటే ఈనెల 7 వ‌ర‌కూ ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close