దేవిశ్రీ‌… ఈసారి చిత‌క్కొట్టేశాడ‌ట‌!

రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ నుంచి ఈమ‌ధ్య స‌రైన పాట‌లు రాలేదు. ఆయ‌న హిట్ సినిమాల్లో పాలు పంచుకుంటున్నారంతే. మ‌హ‌ర్షి లో పాట‌లు, స‌రిలేరు నీకెవ్వ‌రు ఆడియో బాగానే ఉన్నా, దేవిశ్రీ త‌న‌దైన శైలిలో ఊపేసింది లేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించే పాట‌లేవీ దేవిశ్రీ చేయ‌లేక‌పోయాడు. త‌క్కువ స‌మ‌యంలో ఆల్బ‌మ్ పూర్తి చేయాల్సిరావ‌డ‌మో, ప‌ని ఒత్తిడో, త‌న‌కు తాను రొటీన్ అయిపోయాడో తెలీదు గానీ, దేవీ మార్క్ మిస్స‌య్యింద‌న్న‌ది నిజం. ఇదే స‌మ‌యంలో త‌మ‌న్ రెచ్చిపోవ‌డం మొద‌లెట్టారు. వ‌రుస‌గా చార్ట్ బ‌స్ట‌ర్స్ ఇస్తున్నాడు. అల వైకుంఠ‌పుర‌ములో, స‌రిలేరు నీకెవ్వ‌రుకి మ‌ధ్య అస‌లు సిస‌లైన తేడా.. సంగీత‌మే. ‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌’ అనే హిట్ గీతం బ‌న్నీ సినిమాని ఎక్క‌డికో తీసుకెళ్లిపోయింది. అలాంటి పాట‌.. స‌రిలేరులో మిస్స‌య్యింది.

అయితే ఇప్పుడు దేవిశ్రీ మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చేశాడ‌ట‌. `ఉప్పెన` పాట‌ల‌తో. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌కుడ‌దిగా ప‌రిచ‌యం అవుతున్న సినిమా ఇది. దీనికి దేవినే సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్ సినిమా అన‌గానే దేవిశ్రీ ఎలెర్ట్ అయిపోతాడు. ‘కుమారి‌ 21 ఎఫ్‌’కి కూడా దేవి అదిరిపోయే సంగీతాన్ని అందించాడు. ఈసారీ దేవి రెచ్చిపోయాడ‌ట‌. త‌న‌దైన మార్క్ సంగీతాన్ని ఈ సినిమాలో వినిపించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే పాట‌లు విన్న‌వాళ్లు.. ‘ఇదో మ్యూజికల్ హిట్ట‌వ్వ‌డం ఖాయం’ అని కితాబిస్తున్నారు. రేపు ఉద‌యం తొలి పాట విడుద‌ల అవుతోంది. ఈ పాట‌తోనే ‘ఉప్పెన‌’ ప్ర‌మోష‌న్లూ ప్రారంభం కానున్నాయి. ఈ పాట మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేలా వుందని, ఈ పాట‌తో ఈ సినిమాపై ఓ హైప్ క్రియేట్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని చిత్ర‌బృందం న‌మ్మ‌కంగా చెబుతోంది. దేవిశ్రీ ప్ర‌సాద్ రెచ్చిపోయాడంటే… సంగీత ప్రియుల‌కు పండ‌గ ఇక‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close