ఆ స‌మావేశానికి సీనియ‌ర్లు వ‌ద్ద‌ని ఉత్త‌మ్ భావించారా..?

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఓట‌మి త‌రువాత కాంగ్రెస్ పార్టీ నేత‌ల వైఖ‌రిలో పెద్ద‌గా మార్పేమీ క‌నిపించ‌డం లేదు! అవే అల‌క‌లు, అవే ఆధిప‌త్య పోరు. మ‌రీ ముఖ్యంగా సీనియ‌ర్ల వైఖ‌రిలో అస్స‌లు మార్పులేద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలే అంటున్నాయి. పార్టీలో త‌మ‌కు ప్రాధాన్య‌త స‌రిపోవ‌డం లేదనీ, కావాల‌నే త‌మ‌ని ప‌క్క‌న‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మ‌రోసారి హైక‌మాండ్ కి కొంద‌రు సీనియ‌ర్లు ఫిర్యాదు చేశార‌ట‌! మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కొన్ని చోట్ల భాజ‌పాకి కాంగ్రెస్ మ‌ద్ద‌తు ఇచ్చింద‌నీ, ఈ విష‌యం రాష్ట్ర నాయ‌క‌త్వానికి తెలిసినా కూడా ప‌ట్టించుకోవ‌డం లేదంటూ ఆ ఫిర్యాదులో కొంద‌రు సీనియ‌ర్లు పేర్కొన్నార‌ని తెలుస్తోంది. దీంతో సీనియ‌ర్ల‌పై పార్టీ కీల‌క నేత‌లు గుర్రుగా ఉన్నార‌ని సమచారం. ఈ కార‌ణంతోనే పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఇంట్లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి సీనియ‌ర్ల‌ను ఆహ్వానించ‌లేద‌ని వినిపిస్తోంది.

ఉత్త‌మ్ ఇంట్లో జ‌రిగిన మీటింగ్ ఏంటంటే… త్వ‌ర‌లో స‌హ‌కార సంఘాల‌కు ఎన్నిక‌లు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పార్టీ ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నేది చ‌ర్చించేందుకు నేత‌ల‌తో ఉత్త‌మ్ ఇంట్లో భేటీ జ‌రిగింది. క‌నీసం ఈ ఎన్నిక‌ల్లోనైనా పార్టీకి కొంత ఊర‌ట క‌లిగించే ఫ‌లితాల‌ను రాబ‌ట్టాల‌నే వ్యూహంపై చ‌ర్చించారు. అయితే, ఈ స‌మావేశానికి కొంత‌మంది సీనియ‌ర్ నేత‌ల్ని ఆహ్వానించ‌లేదు. కీల‌క‌మైన స‌మావేశాల‌కు త‌మ‌ను పిల‌వ‌క‌పోతే ఎలా అనేది సీనియ‌ర్ల ప్ర‌శ్న‌. అయితే, వారిని పిలిస్తే… విమ‌ర్శ‌లు మాత్ర‌మే చేస్తార‌నీ, సొంత పార్టీ అని చూడకుండా నాయ‌క‌త్వం తీరును త‌ప్పుబ‌డుతూ ఉంటార‌నీ, దీంతో స‌మావేశం ర‌సాభాస‌గా మారుతుంద‌నీ, పార్టీ వ్యూహ‌ర‌చ‌న కంటే త‌ప్పుల్ని విమ‌ర్శించేందుకే సీనియ‌ర్లు ఎక్కువ‌గా ప్రయత్నిస్తారనీ… అందుకే కొంద‌ర్ని పిల‌వ‌లేదు అనేది పార్టీ నేత‌లు అభిప్రాయ‌ంగా తెలుస్తోంది.

నిజానికి, మున్సిప‌ల్ ఎన్నిక‌ల ముందు కూడా వీహెచ్, పొన్నాల లాంటి సీనియ‌ర్ నేత‌లు ఉత్త‌మ్ తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. మున్సిపాలిటీలవారీగా పార్టీ బాధ్య‌త‌లు చూసుకోవాలీ అంటూ కొంద‌రు సీనియ‌ర్ల‌కు అప్ప‌గిస్తే… తాము రాష్ట్రస్థాయి నాయ‌కుల‌మ‌నీ, గ‌ల్లీ స్థాయి ప‌నులు చెబుతున్నారంటూ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పార్టీ త‌ర‌ఫున బ‌లంగా ప్ర‌చారం చేయాల్సిన ఆ స‌మ‌యంలో వీరి అల‌క‌లూ ఆగ్ర‌హాల‌కే కొంత స‌మ‌యం వృథా అయిపోయింది. అదే పున‌రావృతం కావొద్దు అనే ఉద్దేశంతో కొంద‌ర్ని తాత్కాలికంగా దూరం పెట్టామ‌నేది ఉత్త‌మ్ వ‌ర్గం అభిప్రాయ‌ం. అయితే, ఇదీ స‌మ‌ర్థ‌నీయం కాదు. అంద‌ర్నీ క‌లుపుకుని వెళ్లే ధోర‌ణిలో నాయ‌క‌త్వం ఉండాలి. అదే స‌మ‌యంలో… సీనియ‌ర్లు కూడా ఇంకా సొంత నేత‌ల మీద హైక‌మాండ్ కి ఫిర్యాదుల ధోర‌ణీ త‌గ్గించుకోవాలి. టి. కాంగ్రెస్ లో ఈ ప‌రిస్థితి ఎప్ప‌టికి మారుతుందో తెలీదు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిర్‌లైన్స్‌ సహా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ… ప్రధాని సంచలన నిర్ణయం

కొన్నేళ్లుగా ఆర్థిక , రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ను తిరిగి గాడిన పెట్టేందుకు ఇటీవల ఎన్నికైన కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను అమలు చేయాలని...

వైసీపీ కుట్రలకు వీరనారిలా ఎదురు నిలిచిన మహిళ..!!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసింది. వ్యవస్థలను తమ చెప్పు,చేతుల్లో ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చిందన్న విమర్శలు మూటగట్టుకుంది. దాంతో ఎన్నికలను కూడా సరైన విధంగా నిర్వహించేందుకు వైసీపీ సహకరిస్తుందా..? అనే...

రంగంలోకి కేజ్రీవాల్… బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతారా..?

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవల మధ్యంతర బెయిల్ రావడంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతమేర ఉంటుందనేది చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఢిల్లీలోని లోక్ సభ...

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close