చంద్రబాబు మాజీ పీఏపై కేంద్ర సంస్థల దర్యాప్తు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద చాలా కాలం పాటు పర్సనల్ అసిస్టెంట్‌గా పని చేసిన పెండ్యాల శ్రీనివాస్ అనే ఏపీ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేపట్టారు. దర్యాప్తు చేస్తున్న ఇన్‌కంట్యాక్స్ అధికారులా.. లేక మరో దర్యాప్తు సంస్థకు చెందిన వారా..అన్న క్లారిటీ లేదు. రాష్ట్ర పోలీసు అధికారులకు కూడా సమాచారం లేదు. భద్రతగా కూడా… సీఆర్‌పీఎఫ్ బలగాలను తెప్పించుకున్నారు. చాలా కాలం పాటు చంద్రబాబు వద్ద పీఏగా పని చేసినఆయన తర్వాత రిలీవ్ అయ్యారు. ప్రస్తుతం జీఏడీలో స్టాటిస్టికల్‌ అధికారిగా ఉన్నారు.

విజయవాడ సిద్దార్ధనగర్‌లో ఉన్న ఇంట్లోతో పాటు ఆయనకు సంబంధించిన ఇళ్లలో కూడా.. ఈ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అత్యంత రహస్యంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇంటి బయట దృశ్యాలను చిత్రీకరించడానికి కూడా భద్రతా సిబ్బంది అంగీకరించలేదు. మొదట.. అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారేమోనన్న ప్రచారం జరిగింది. కానీ తాము సోదాలు చేయడం లేదని ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో అసలు పెండ్యాల శ్రీనివాస్ ఇంటిపై దాడులు చేసి సోదాలు చేస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థలన్న విషయం మాత్రం క్లారిటీ వచ్చింది. సాధారణంగా అవినీతి పరమైన అంశాలు.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు.. అన్నీ ఏపీ ప్రభుత్వ పరిధిలోని ఏసీబీలోకే వస్తాయి.

కానీ.. ఇక్కడ రంగంలోకి దిగింది కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఏ అంశంపై ఇలా సోదాలు చేస్తున్నారన్నదానిపై చిన్న విషయం కూడా బయటకు రావడం లేదు. పెండ్యాల శ్రీనివాస్.. చంద్రబాబు దగ్గర పీఏగా పని చేయడం.. తాజా రాజకీయ పరిణామాల నేపధ్యలో నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడంతో… ఏదో రాజకీయ సంచలనం ఉండబోతోందన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. సోదాలపై సంబంధిత సంస్థ అధికారిక ప్రకటన చేస్తేనే కానీ క్లారిటీ రాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close