మాకేం తెలియదు..! వైసీపీ ఎన్డీఏలో చేరికపై ఏపీ బీజేపీ రియాక్షన్ ..!

ఎన్డీఏలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరబోతోందని జరుగుతున్న ప్రచారం ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేతలతో పాటు.. వైసీపీలోని కొంత మంది ఇతర నేతలకూ ఎలాంటి సమాచారం లేక ఎలా స్పందించాలో తెలియక తంటాలు పడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ గా ఉన్న సునీల్ ధియోదర్.. ఈ అంశంపై.. నొప్పింపక.. తానొవ్వక అన్నట్లుగా స్పందించడానికి ప్రయత్నించారు. నేరుగా వైసీపీని ఎన్డీఏలో చేర్చుకుంటున్నారా.. అన్న ప్రశ్నలకు… టీడీపీతోగానీ, వైసీపీతోగానీ ఎలాంటి పొత్తు లేదని చెప్పుకొచ్చారు. రెండు పార్టీలు మాకు రాజకీయంగా శత్రువులే..వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు ప్రకటించారు. టీడీపీకి ఎప్పుడో తలుపులు మూసేశారు కాబట్టి… వైసీపీ ఒక్కదానిపై స్పందించలేక.. ధియేధర్.. టీడీపీని కలిశారు. అయితే.. ఆయన స్పందన వైసీపీ ప్రకారమే చూసుకుంటే… ఆ పార్టీతో ఎలాంటి విబేధాలు లేవని… షరతులు వర్తిస్తాయన్నట్లుగా ప్రకటించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ కూడా దాపుగా ఇలాంటి ప్రకటనే చేశారు. బీజేపీతో ఎలాంటి ఘర్షణ అవసరం లేదని ప్రకటించారు. బీజేపీతో వైసీపీ పొత్తుపెట్టుకుంటుందని జరుగుతున్న ప్రచారం మాత్రమేనని సునీల్ ధియోధర్ చెబుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా… ఎన్డీయేలో వైసీపీ చేరడంపై సమాచారం లేదని ప్రకటించారు. టీడీపీ, వైసీపీకి సమానదూరంలో ఉండాలనేది తమ పార్టీ విధానమని ఆయన అంటున్నారు. బొత్స ఎందుకలా మాట్లాడారో తెలియడం లేదని ఆశ్చర్యం వ్యక్త ంచేశారు. ప్రధాని, హోంమంత్రిని సీఎం కలవడం సహజమేనని బీజేపీ నేతలు చెబుతున్నారు.

అయితే నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా… పరిస్థితి మారింది. వైసీపీలో ఎవరు ఏం మాట్లాడాలన్నా… వైసీపీ ముఖ్యుల నుంచి స్క్రిప్ట్ వస్తుంది. అలాంటిదేమీ లేకుండా బొత్స సత్యనారాయణ.. బీజేపీతో పొత్తుల గురించి మాట్లాడే అవకాశం లేదు. ఇటీవలి కాలంలో కీలకమైన విషయాలపై లీకులన్నీ.. వైసీపీ హైకమాండ్.. బొత్స ద్వారానే ఇప్పిస్తోంది. తాజాగా… ఇది కూడా ఆ కోణంలోనిదేనని భావిస్తున్నారు. మొత్తంగా బయటకు వచ్చే సరికి అందరూ లేదు లేదు అనడమే రాజకీయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close