ప‌వ‌న్‌ని వ‌ద‌ల‌ను: నితిన్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ కి నితిన్ ఎంత భ‌క్తుడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వీలైన‌ప్పుడ‌ల్లా, వీలు లేకున్నా స‌రే.. ప‌వ‌న్ గురించి ఒక్క మాటైనా మాట్లాడేస్తాడు. త‌న సినిమాల్లో ప‌వ‌న్‌కి సంబంధించిన రిఫ‌రెన్సులెన్నో క‌నిపిస్తాయి. తాజాగా `భీష్మ‌`లో కూడా ప‌వ‌న్‌ని గుర్తు చేసి, ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి ఖుషీ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఖుషీ సినిమాలోని ఓ స‌న్నివేశాన్ని నితిన్ ఇందులో ఇమిటేట్ చేశాడు. ఇలా ప్ర‌తీసారీ ప‌వ‌న్‌ని గుర్తు చేయాల్సిందేనా? అడిగితే.. ఏమాత్రం మొహ‌మాటం లేకుండా `య‌స్‌` అనేస్తున్నాడు నితిన్‌.

త‌న ప్ర‌తీ సినిమాలోనూ ప‌వ‌న్‌కి సంబంధించిన రిఫరెన్స్ క‌నిపిస్తుంద‌ని, ఒక పాట‌లోనో, డైలాగ్‌లోనో ప‌వ‌న్‌ని గుర్తు చేస్తూనే ఉన్నాన‌ని, ఇది వ‌ర‌కు మీడియా ఇంత‌గా లేదు కాబ్ట‌టి, కొన్ని సినిమాలు ఫ్లాపులు అయ్యాయి కాబ‌ట్టి అవేమీ వెలుగులోకి రాలేద‌ని, ఇప్పుడు మాత్రం అవే క‌నిపిస్తున్నాయని, ఇదంతా ప‌వ‌న్‌పై త‌న‌కున్న ప్రేమ‌ని, అభిమానాన్ని చాటుకోవ‌డంలో ఓ భాగ‌మే అని, ప‌వ‌న్ ని గుర్తు చేయ‌డం ఎప్ప‌టికీ వ‌ద‌ల‌న‌ని నితిన్ చెప్పేశాడు. త‌న రాబోయే సినిమాల్లోనూ ప‌వ‌న్ రిఫ‌రెన్సులు ఉంటాయ‌ని ఈ విష‌యంలో తాను మొహ‌మాట‌ప‌డ‌న‌ని చెప్పుకొచ్చాడు నితిన్‌. అయితే భీష్మ‌లో ఖుషీ సీన్ ఒక్క‌దాన్నే వాడాన‌ని అంతకు మించిన రిఫ‌రెన్సులు ఉండ‌వ‌ని క్లారిటీ ఇచ్చాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close