అఫీషియ‌ల్‌: ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌

అల వైకుంఠ‌పుర‌ములో త‌ర‌వాత త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత ఎన్టీఆర్ ప‌ట్టాలెక్కించే సినిమా ఇదేన‌ని వార్త‌లొచ్చాయి. ఇప్పుడు వాటిపై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వచ్చేసింది. ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ కుదిరింది. ఎన్టీఆర్ న‌టించే 30వ సినిమా ఇది. ఎస్‌.రాధాకృష్ణ‌, నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ నిర్మాత‌లు. 2021 వేస‌విలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు. అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌లో ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్‌ల మ్యాజిక్ చూశారంతా. అది ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో న‌డిచే క‌థ‌. ఈసారి పూర్తి స్థాయి వినోదాత్మ‌క చిత్రంతో రానున్నారు. జూన్ – జులైల‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. `అయిన‌నూ పోవ‌లె హ‌స్తిన‌కు` అనే పేరు ఈ సినిమా కోసం ప‌రిశీలిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందించ‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వకీల్ సాబ్… వర్క్ మొద‌లైంది

క‌రోనా ఎఫెక్ట్, లాక్ డౌన్‌ల వ‌ల్ల షూటింగులు ఆగిపోయాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కూ ఆటంకం ఏర్ప‌డింది. అయితే కొన్ని సినిమాలు మాత్రం ధైర్యం చేస్తున్నాయి. వీలైనంత వ‌ర‌కూ సినిమాని సిద్ధం చేసే ప్ర‌య‌త్నాల్లో...

ఓటీటీలో రాజ‌మౌళి శిష్యుడి సినిమా

రాజ‌మౌళి శిష్యుడు అశ్విన్ గంగ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'ఆకాశ‌వాణి'. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ధారి. ఈ సినిమా ఓ వెరైటీ కాన్సెప్టుతో తెర‌కెక్కుతోంది. నోరు లేని రేడియో... ఓ భ‌యంక‌ర‌మైన విల‌న్ పై...

పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన కేసులు కూడా ఎత్తేస్తారా..!?

ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు రాను రాను వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే దళితులపై పోలీసుల అరాచకాలు హైలెట్ అవుతూండగా.. తాజాగా..పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి.. పోలీసుల్ని కొట్టి విధ్వంసం సృష్టించిన కేసులను కూడా... ఎత్తేయాలని నిర్ణయించుకోవడం...

వైఎస్-చంద్రబాబు స్నేహంపై దేవాకట్టాకు కాపీరైట్ ఉందా..!?

నిర్మాత విష్ణు ఇందూరి - దర్శకుడు దేవా కట్ట మధ్య నాలుగు రోజుల కిందట.. సోషల్ మీడియాలో ప్రారంభమైన... వైఎస్ - చంద్రబాబు స్నేహం కథపై సినిమా వివాదం టీవీ చానళ్లకు ఎక్కింది....

HOT NEWS

[X] Close
[X] Close