ఆదాని పోయింది… కానీ ప్రభుత్వం కారణం కాదన్న మంత్రి..!

విశాఖలో రూ.70వేల కోట్లతో పెట్టాలనుకున్న ఆదాని డేటా సెంటర్… కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణకు తరలిపోయింది. కాపులుప్పాడ ప్రాంతంలో ఆదాని డేటా సెంటర్‌కు గత ప్రభుత్వం భూములు కేటాయించింది. శంకుస్థాపన కూడా చేసింది. కొన్ని వేల ఉద్యోగాలు.. ఆ డేటా సెంటర్ వల్ల వస్తాయని.. విశాఖ డేటా టెక్నాలజీకి కేంద్రంగా ఎదుగుతందని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత .. ఆదాని అనూహ్యంగా.. మనసు మార్చుకుంది. ఆ ప్రాజెక్ట్‌ను.. హైదరాబాద్‌కు తరలించింది. ప్రభుత్వం వివిధ అంశాల్లో… ఆదాని కంపెనీకి ఇబ్బందులు పెట్టడం వల్లే.. వెళ్లిపోయిందన్న ప్రచారం జరిగింది. దీన్ని పరిశ్రమల మంత్రి గౌతంరెడ్డి ఖండిస్తున్నారు.

ఇప్పటి వరకూ ఆదాని వెళ్లిపోయిందని..అధికారికంగా ఎప్పుడూ చెప్పని మంత్రి గౌతంరెడ్డి.. మొదటి సారి.. ఆ పరిశ్రమ వెళ్లిపోయిందని.. విశాఖలో తేల్చేశారు. విశాఖలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. విశాఖ నుంతి ఆదాని వెళ్లిపోవడానికి కారణం ప్రభుత్వం కాదన్నారు. ఆదానికి ఉన్న అననుకూలతల వల్లే వెళ్లిపోయిందని కొత్త కారణం చెప్పారు. ఆదాని వెళ్లిపోవడానికి ప్రభుత్వం కారణమని జరుగుతున్న ప్రచారం దురదృష్టకరమన్నారు. ఆదాని కంపెనీ..ఆషామాషీగా రూ. 70వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాదని.. అంటున్నారు.

డేటా సెంటర్ కు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండటం వల్లే విశాఖ కు వచ్చిందని.. భూములు కేటాయించిన తర్వాత శంకుస్థాపన పూర్తి చేసిన తర్వాత ..మంత్రి చెప్పినట్లుగా అనుకూలంగా లేదని ఎలా గుర్తిస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే గౌతంరెడ్డి మాత్రం.. ఆదాని డేటా లేకపోయినా.. వచ్చే ఏడాది కల్లా.. ఒక్క విశాఖలోనే యాభై వేల ఐటీ ఉద్యోగాలను సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మిలీనియం టవర్స్ లో సచివాలయం రాదని.. రెండో టవర్ ని కూడా ఐటీ కంపెనీల కోసమే అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close