భాజ‌పా అధ్య‌క్ష నియామ‌కంపై విద్యాసాగ‌ర్ గంద‌ర‌గోళం..!

తెలంగాణ భాజ‌పాకి కొత్త అధ్య‌క్షుడి ఎంపిక ప్ర‌క్రియ త్వ‌ర‌లో పూర్త‌వుతుంది అనే క‌థ‌నాలు ఈ మధ్య వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ని కొన‌సాగిస్తార‌ని కాసేపు, పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నియ‌మించాల‌ని జాతీయ నాయ‌క‌త్వం ఆలోచిస్తోంద‌ని కాసేపు… ఇలా ఈ మ‌ధ్య భాజ‌పాలో ర‌క‌ర‌కాల చర్చలు జ‌రుగుతున్నాయి. అయితే, మ‌హారాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్ సీహెచ్ విద్యాసాగ‌ర‌రావు చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ‌తోపాటు, ఆంధ్రా భాజ‌పా వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయం అయింది.

రెండు తెలుగు రాష్ట్రాల భాజ‌పా శాఖ‌ల‌కి కొత్త అధ్య‌క్షులు రాబోతున్నారంటూ మొన్న‌నే ఆయ‌న వ్యాఖ్యానించారు. దీంతో ల‌క్ష్మ‌ణ్‌, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ మార్పు త‌ప్ప‌దా అనే క‌థ‌నాలు చ‌క్క‌ర్లు కొట్టాయి. రెండు రాష్ట్రాల‌కీ కొత్త‌వారంటే ఎవ‌రూ అనే చ‌ర్చా న‌డిచింది. విద్యాసాగ‌ర్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో తెలంగాణ భాజ‌పా వ‌ర్గాల్లో ఓ రోజంతా ఇదే చ‌ర్చ జ‌రిగింది. ఆయ‌న‌కి ఢిల్లీ నుంచి ప‌క్కా స‌మాచారం ఉండ‌బ‌ట్టే ఇలాంటి లీకులు ఇస్తున్నారా అనే అభిప్రాయ‌మూ వ్య‌క్త‌మైంది. అయితే, శుక్ర‌వారం నాడు ఇదే అంశ‌మై మ‌రోసారి స్పందిస్తూ… ఆ ముందురోజు తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు పూర్తి భిన్నంగా మాట్లాడారు.

రాష్ట్ర అధ్య‌క్షుల‌ను నియ‌మించేది తాను కాద‌నీ, జాతీయ నాయ‌క‌త్వం నిర్ణ‌యిస్తుంద‌ని విద్యాసాగ‌ర్ వివ‌ర‌ణ ఇచ్చారు. తాను నిర్ణ‌యించ‌లేన‌ని అన్నారు. అంతేకాదు, తెలంగాణ భాజ‌పా అధ్య‌క్ష రేసులో తాను లేన‌న్నారు. ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించాన‌నీ, త‌న‌కు రాష్ట్ర అధ్య‌క్షుడి ప‌ద‌వి అవ‌స‌రం లేద‌న్నారు. అంతేకాదు, రెండు తెలుగు రాష్ట్రాల‌కూ ప్ర‌స్తుతం ఉన్న అధ్య‌క్షుల‌ను కొన‌సాగించినా ఆశ్చ‌ర్యం లేద‌నీ, అలా చేసినా సాంకేతికంగా వారు కొత్త అధ్య‌క్షులు అవుతారు క‌దా అని అభిప్రాయ‌ప‌డ్డారు. క‌న్నా, ల‌క్ష్మ‌ణ్ పోస్టుల్లో ఎలాంటి మార్పూ ఉండ‌ద‌ని ఇవాళ్ల చెప్పిన‌ట్టు..! అయితే, విద్యాసాగ‌ర్ వ్యాఖ్య‌లపై ల‌క్ష్మ‌ణ్ స్పందించారు. ఆయ‌న వ్యాఖ్యల్ని సీరియ‌స్ గా తీసుకోవాల్సిన ప‌నిలేద‌ని సులువుగా తీసిపారేసిన‌ట్టు మాట్లాడారు! నిజానికి, గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్న త‌రువాత పార్టీప‌రంగా మ‌రోసారి క్రియాశీలం అయ్యేందుకు విద్యాసాగ‌ర్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ల‌క్ష్మ‌ణ్ ఇలా వ్యాఖ్యానించ‌డ‌మూ విశేష‌మే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close