అచ్చెన్నకు ఆ మీడియా శిక్ష వేసేసినట్లే..!?

తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో ఏం జరిగింది..?

అక్కడ అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత బాధ్యులను గుర్తించారు. నిజంగా అవినీతి జరిగిందని నిర్ధారించుకున్నారు. డబ్బులు పెద్ద ఎత్తున చేతులు మారాయని తెలుసుకున్నారు. అన్నీ తేలిన తర్వాత కేసులు పెట్టి.. ఆ తర్వాత మీడియాకు సమాచారం. ఓ పద్దతి ప్రకారం.. వ్యవహరించాల్సిన విధానం ఇది.

కానీ ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో లీకులతో మీడియా విచారణ..!

ఆంధ్రప్రదేశ్‌లో విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ను.. ప్రభుత్వానికి సబ్ మిట్ చేసిందో లేదో కూడా తెలియదు. కానీ.. వెంటనే మీడియాకు లీక్ అయిపోయింది. అధికార పార్టీ కి అండగా ఉన్న మీడియాకు ఈ రిపోర్ట్ వెళ్లిపోవడం ఆలస్యం.. తీర్పు చెబుతూ… బ్రేకింగ్స్ వేసేసి.. ఆ తర్వాత విచారణ ప్రారంభించాయి ఆ మీడియా సంస్థలు. అచ్చెన్న ను టార్గెట్ చేస్తూ.. వచ్చిన ఆ కథనాలు .. ఆయనకు నేరుగా శిక్ష విధించినట్లుగా అయింది.

విజిలెన్స్ ఏ ఆధారాలతో… ఆ నివేదిక సమర్పించిందో కానీ.. నిజంగా అలాంటి అవినీతి జరిగి ఉంటే.. ముందుగా చేయాల్సింది.. తదుపరి విచారణ చేయడం. ఆ ఈఎస్‌ఐ లావాదేవీల్లో ఎలా అవినీతి జరిగింది..? బాధ్యులెవరు..? డబ్బులు ఎంత మేర చేతులు మారాయి..? ఆ డబ్బులు ఎవరెవరికి చేరాయన్నదానిపై కూపీ లాగాలి. ఇదంతా సీక్రెట్ గా జరగాలి. కానీ విజిలెన్స్ రిపోర్ట్ పేరుతో బురద చల్లితే చాలనుకున్నట్లుగా.. ప్రస్తుత రిపోర్ట్ బయటు వచ్చింది. దాన్ని ఓ వర్గం మీడియా హడావుడి ప్రారంభించింది. వీళ్ల హడావుడి చూసి.. అచ్చెన్నాయుడు.. నేరుగా సవాల్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఎక్కడైనా జరిగినా… అందులో తన ప్రమేయం ఉన్నా… సరే నిరూపించాలన్నారు.

విచిత్రం ఏమిటంటే.. ఈ ఈఎస్‌ఐ స్కాం రిపోర్ట్ గురించి… కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాంకు తెలియదు. ఆయన మీడియాలో చూసిన తర్వాతే… ఓ ప్రకటన చేశారు. కార్మికుల్ని గత ప్రభుత్వం దోచుకుందని… ఎవర్నీ వదిలి పెట్టబోమని ఆ ప్రకటన సారాంశం. మొత్తానికి .. నిజంగా స్కాంలు జరిగినా.. జరగకపోయినా.. మీడియాలో మాత్రం… గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిపై ..బురద చల్లడానికి ఓ మాస్టర్ ప్లాన్‌గా ఈ వ్యవహరం ఉందన్న అభిప్రాయం మాత్రం రాజకీయవర్గాల్లో ఏర్పడిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close