ఆ “సిట్” చంద్రబాబునైనా అరెస్ట్ చేయగలదు..!

చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ల నిర్ణయాలన్నింటిలో అవినీతిని వెలికి తీసేందుకు ప్రభుత్వం కొల్లి రఘునాథ్ రెడ్డి అనే పోలీసు అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్‌కు విశేషాధికారాలు ఉన్నాయి. కేసులు పెట్టడం… అరెస్ట్ చేయడం… సహా.. మొత్తం ఓ పోలీస్ స్టేషన్ కు ఉండే అధికారాలు అన్నీ ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఏర్పాటు చేస్తూంటారు. ఓ భారీ ఇన్సిడెంట్ జరిగి… ఓ బృందం ప్రత్యేకంగా ఆ పని మీద ఉండి.. తక్షణం తేల్చాల్సిన వ్యవహారాలు ఉంటే మాత్రమే… అలాంటివి ఏర్పాటు చేస్తూంటారు. అయితే.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం.. ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిది నెలల తరవాత ఈ సిట్ ను ఏర్పాటు చేసింది.

తొమ్మిది నెలల కాలంలో గత ప్రభుత్వంలో జరిగిన ఎలాంటి అవినీతిని పట్టుకోలేకపోయారని.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో… మంత్రివర్గ ఉపసంఘం కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సిట్ ఏర్పాటు చేయడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. దీనిని ఏర్పాటు చేయడానికి ముందే… మంత్రి అచ్చెన్నాయుడు పై విజిలెన్స్ రిపోర్ట్ ను లీక్ చేశారు. అచ్చెన్నాయుడు ఆదేశాలతోనే.. ఈఎస్‌ఐలో అవకతవకలు జరిగాయన్నట్లుగా ఓ వర్గం మీడియాలో విపరీతమైన ప్రచారం చేయించారు. ఆ వెంటనే ఈ సిట్ ను ప్రకటించారు. దీంతో ప్రభుత్వం ఓ ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తోందే విమర్శలు వస్తున్నాయి.

ప్రస్తుతం నియమించిన సిట్ కు ఇచ్చిన విశేషాధికారాలు…. అందరూ పోలీసు అధికారుల్నే అందులో నియమించడంతో… ప్రభుత్వ ఉద్దేశం వేరుగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. కొంత మందిని ఎలాగైనా ఒక్క రోజైనా జైల్లో పెట్టాలన్న లక్ష్యంతో కొంత మంది ప్రభుత్వ పెద్దలు ఉన్నారని.. ఆ లక్ష్యాలను ఈ సిట్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేయబోతున్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. ముందు ఆధారాలు… ఉన్నా లేకపోయినా… మీడియా ప్రచారంతో.. ఏదో ఒకటి చేసి.. అరెస్ట్ చేస్తే… తమ పంతం నెగ్గుతుందని.. తర్వాత ఆ కేసు నిలబడినా.. నిలబడకపోయినా.. పోయేదేమీ లేదన్న అభిప్రాయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం .. ఓ ప్రత్యేక లక్ష్యంతోనే ఈ సిట్ ను ఏర్పాటు చేసింది. ఆ లక్ష్యం… రాజకీయ ప్రకపంనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close