చస్తే చావండి… !

మీడియాకు ఏం ఉన్నా లేకపోయినా సామాజిక బాధ్యత ఉండాలి. రేటింగ్స్ యావలో సమాజానికి హాని కలిగినా పరవాలేదనే ధోరణి ఈ మధ్య బాగా పెరిగింది. భయానకమైన దృశ్యాలు, అసభ్యమైన కథనాలు, నిర్ధారణ కాకుండానే నిందితులను దోషులుగా తేల్చేసి, వారి పరువు తీసే వార్తలు ప్రసారం చేయడం సర్వ సాధారణంగా మారిపోయింది.

నెల్లూరు జిల్లా కావలిలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకుంది. మాధవి అనే ఆమె, భాను అనే వ్యక్తితో ప్రేమ విఫలమైందనే బాధతో ఆత్మహత్య చేసుకుంది. అంతకు ముందు సెల్ ఫోన్ వీడియోలో తన బాధను రికార్డ్ చేసింది. అంతే…. పలు తెలుగు వార్తా చానళ్లు రోజంగా ఇక మరో వార్త లేనట్టు పదే పదే అదే సీన్ చూపించారు. కొన్ని చానళ్లు మాత్ర కాస్త నియంత్రణ పాటించాయి.

ఆత్మహత్య అనేది చాలా సున్నితమైన విషయం. మీడియాలో ఆత్మహత్య వార్తలు ఎక్కువగా వచ్చినప్పుడు సమాజంలో ఆత్మహత్య ఘటనలు పెరుగుతాయి. ఏ పోలీసు అధికారిని అడిగినా ఈ విషయం చెప్తారు. అందుకే, పాశ్చాత్య దేశాల్లోని కొన్ని పత్రికల్లో కనీసం ఆత్మహత్య వార్తలు క్లుప్తంగా కూడా ప్రచురించరు. మనిషి బలహీన క్షణంలో ఈ వార్తలు ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయనేది సైకాలజిస్టులు ఎప్పుడో తేల్చి చెప్పారు.

తెలుగు మీడియాలో మాత్రం రేటింగ్స్ కోసం కక్కుర్తి పడటం తప్ప మంచీ చెడూ విచక్షణ లేని చానల్స్ చాలా ఉన్నాయి. మాధవి సెల్ఫీ వీడియోను, ఆమె మాటలను, కన్నీళ్లు పెట్టుకునే సీన్ ను చూసిన వారు, బాధల్లో బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక బలపడటానికి కారణం కావచ్చు. పదే పదే ఆమె కన్నీటి రోదనను చూపించడం ఎందుకు? ఒకరి చావు కూడా మీడియాకు వ్యాపార సాధనం అవుతుందా? రేటింగ్స్ పెంచుకోవడానికి ఇంత నిస్సిగ్గుగా సమాజానికి హాని చెయ్యాలా? కాస్త సంయమనం పాటించాలనే ఇంగితం లేని చానళ్లను మనం రోజూ చూడాల్సి రావడం మన దౌర్భాగ్యం.

కాస్త సంయమనం పాటించిన చానళ్లకు ఏమైనా నష్టం కలిగిందా? లేదే. వాళ్లు మిగతా వార్తలను కూడా ప్రసారం చేశారు. దీన్ని కూడా ఒక వార్తగా చూపించారు. అయితే కొన్ని అతి ప్రముఖ బడా బడా చానల్స్ మాత్రం పాత్రికేయ ప్రమాణాలను పాతరేసి మనిషి చావును కూడా క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించిన తీరు హేయం. జుగుప్సాకరం.

హైదరాబాద్ లో డాక్టర్స్ ఫైరింగ్ ఘటనలోనూ కొన్ని బడా చానల్స్ గత దాటాయి. తమ ఇష్టం వచ్చినట్టు కొందరిని హంతకులని, లేడీ డాన్ అని ముద్ర వేసేశాయి. గంటల కొద్దీ కథనాలను ప్రసారం చేశాయి. ఈ ఘటనలో ఒక మహిళలే కీలక పాత్ర అని, ఆమే హంతకురాలని ఓ చానల్ తీర్పు చెప్పేసింది. అంతటితో ఆగలేదు, హత్యకు ఇలా ప్లాన్ చేసి ఉంటుంది, అలా ప్లాన్ చేసి ఉంటుందని నొటికొచ్చినట్టు కట్టుకథను అల్లి జనం మీద రుద్దిన చానల్స్ కూడా ఉన్నాయి. ఎందుకింత బాధ్యతా రాహిత్యం? లోకానికి నీతులు చెప్పే మీడియాలో బాధ్యతారాహిత్య పెరుగుతోంది కాబట్టే దీన్ని కంట్రోల్ చేయాలని, కఠిన చట్టాలు రావాలనే డిమాండ్ పెరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close