ఏపికి మరొక పర్యాటక ఆకర్షణ: ఐ.ఎన్.ఎస్.విరాట్ యుద్దనౌక

విమాన వాహక ఐ.ఎన్.ఎస్. విరాట్ యుద్ద నౌక సుమారు మూడు దశాబ్దాలుగా భారత నావికాదళానికి సేవలు అందిస్తోంది. అంతకు ముందు సుమారు రెండు దశాబ్దాలపాటు బ్రిటన్ కి చెందిన రాయల్ నేవీకి సేవలు అందించింది. ప్రపంచంలో కెల్లా అతి ఎక్కువ కాలం సేవలు అందించిన యుద్ద నౌక అదే. దానిని ఈ ఏడాదిలో డీ కమీషన్ చేసి పక్కన పెట్టబోతున్నారు. ఇదివరకు కురుసుర సబ్ మెరైన్ న్ని 2001లో నావికాదళం సేవల నుండి తప్పించినపుడు దానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని విశాఖ బీచ్ ఒడ్డున నిలిపి దానిని సబ్ మెరైన్ మ్యూజియంగా మార్చేసారు. అది విశాఖ నగరంలో అతి ముఖ్యమయిన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారిపోయింది.

ఇప్పుడు ఐ.ఎన్.ఎస్. విరాట్ యుద్ద నౌకని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర రక్షణ శాఖను కోరారు. అందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. దానిని డీ కమీషన్ చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తారు. దానిని కూడా సముద్రం ఒడ్డున నిలిపి, పర్యాటక కేంద్రంగా మలచాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

దానిలో 1500 గదులు ఉన్నాయి. సుమారు 500మందికి పైగా సమావేశమయ్యేందుకు అవసరమయిన విశాలమయిన సమావేశ మందిరం ఉంది. దానిపై నేరుగా హెలికాఫ్టర్లు దిగడానికి వీలుంది. కనుక దానిలో కొంత బాగాన్ని హోటల్ గా మార్చి మిగిలిన దానిని మ్యూజియంగా మార్చాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అది కూడా అందుబాటులోకి వచ్చినట్లయితే ఇక విశాఖనగరం రాష్ట్రంలో ప్రధాన పర్యాటక కేంద్రంగా మారిపోతుంది. ఆ బారీ యుద్ద నౌకని డీ కమీషన్ ప్రక్రియ పూర్తి చేసి, దానిని సముద్రం ఒడ్డుకి తీసుకువచ్చి నిలపడానికి మరొక సంవత్సర కాలం పట్టవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com