చంద్రబాబును అడ్డుకున్న వాళ్లతో పాటు కేసులు కూడా ఫేమస్సే..!

విశాఖ ప్రజలే చంద్రబాబును అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి బయటకు వస్తున్న దృశ్యాలకు పొంతన లేకుండా పోయింది. అక్కడ వివిధ జిల్లాల నుంచి వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అందులో ఎక్కువ మంది క్రిమినల్స్ ఉన్నారు. వీరిలో ఒంగోలు నుంచి వచ్చిన ఓ నేత.. వైసీపీ యూత్ వింగ్ అనే పోస్టర్ పట్టుకుని నిలబడి… ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఇక గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున కుమారుడు కూడా… చంద్రబాబును అడ్డుకున్న వారిలో ఉన్నారు. అలాగే.. పెందుర్తి, అనకాపల్లి ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు రచ్చ చేశారు. కేకే రాజు అనే వైసీపీ నేత పోలీసుల్ని దుర్భాషలాడుతూ.. నెట్టి వేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.

ఇక జేటీ రామారావు అనే వ్యక్తి చంద్రబాబు విశాఖలో అడుగుపెడితే.. పెట్రోల్ పోసుకుంటానంటూ.. హంగామా చేశారు. ఆ జేటీ రామారావుపై పదుల సంఖ్యలో కేసులున్నాయి. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన కేసుల్లో … మహిళ అక్రమ రవాణా కేసుల్లోనూ అరెస్టయ్యారు. ఈయన పోలీస్ వ్యాన్ పై ఎక్కి మరీ.. హంగామా చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ అనుచరుడిగా ఉన్నారు. ఎయిర్ పోర్టులో పోలీసు ఎదుటే .. చంద్రబాబుకు చెప్పులు చూపిస్తున్న ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న ఫక్త్ అనే యువకుడు మూడు రేప్ కేసుల్లో నిందితుడు. విశాఖ పోలీసులకు ఆ వ్యక్తి గురించి బాగా తెలుసు.

ఫక్త్ అనే వ్యక్తి ఎదురుగా పోలీసులు ఉన్నా.. చెప్పులతో హంగామా చేస్తున్నా… ఏమీ అనలేకపోయారు. మరో వైపు.. చంద్రబాబును అడ్డుకునేందుకు తీసుకు వచ్చిన కార్యకర్తలుక డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లను పంచుతున్న దశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అందరూ విశాఖ ప్రజలేనని వైసీపీ నేతలు చెబుతున్నదానికి…వారంతా వైసీపీ కార్యకర్తలేనని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. పోలీసులు కేసులు నమోదు చేయకపోవడంపై కూడా.. టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close