హామీలు రాని హడావుడి

Telakapalli-Raviముద్రగడ పద్మనాభం దీక్ష విరమణ వెనువెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయిలుదేరారు. ప్రధానితో సహా కేంద్ర మంత్రులు చాలామందిని కలిశారు. వారందరికీ తాను చేసిన విజ్ఞప్తులను చెప్పారే గాని వారేం చెప్పారో మాత్రం నిర్దిష్ట హామీలు వెల్లడించలేదు. ఎందుకంటే అలాటివి దాదాపు రాలేదు. కొద్ది రోజుల కిందట నీతి ఆయోగ్‌ చైర్మన్‌ అరవింద్‌ పంగారియా విజయవాడలో ఆయనతో సమావేశమైనప్పుడే కేంద్రం విదిలింపులు స్వల్పంగా వుండబోతున్నాయని ముఖ్యమంత్రికి సమాచారం అందింది. 2016-17 కేంద్ర బడ్జెట్‌లో రు.3000 కోట్లకు మించి ఎపికి వచ్చే అందే అవకాశం లేదని పంగారియా స్పష్టంగా చెప్పారు. దాంతోహుటాహుటిన బయిలుదేరి వెళ్లారు. అమరావతికి రు.4000 కోట్లు, పోలవరంకు రు.8,000 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీకి రు,13,799 కోట్లు కోరుతూ విజ్ఞప్తి పత్రాలుతీసుకెళ్లారు. పోలవరంకు ఇప్పటి వరకూ రు.2వేల కోట్లకు పైగా ఖర్చు చేసినందువల్ల వాటిని విడుదల చేయాలని కూడా ఆయన కోరారు. వీటితో పాటే కొత్త రైల్వే పథకాలపైన సూచనలు చేశారు.ఈ అంశాలన్నీ విశదంగానే చెప్పారు గాని కేంద్రం కేటాయింపులపైన హామీలిచ్చినట్టు మాత్రం చంద్రబాబు చెప్పలేదు. ప్రత్యేక హౌదా సమస్యపై నీతి అయోగ్‌ నివేదిక అందిందని చెప్పిన ప్రధాని నిజంగా అది సానుకూలంగా వుంటే సూచన చేసి వుండేవారు.అయితే అది అనుకూలంగా లేదని తెలిసిన తర్వాతే ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీ గురించి అడిగారు గాని.అది వచ్చేది కాదని రాష్ట్ర ఆర్థిఖ శాఖ ఎప్పుడో నిర్ధారించుకుంది. విజయవాడ పర్యటనలోనూ ఇటీవల ఢిల్లీలో వివిధ సందర్బాలలోనూ ఆయోగ్‌ చైర్మన్‌ పంగారియా ఇది స్పష్టంగానే చెబుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడు ప్యాకేజీ కూడా ప్రకటించకపోతే దానిపైనా ఆశలు వదులుకోవలసిందే. అమరావతి విషయానికి వస్తే ఇచ్చిన వాటితో నిర్మాణాలు చేపట్టకుండా వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం నిరాకరిస్తున్నట్టు బిజెపి నేతలు చెబుతున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ శంకుస్థాపన ప్రకటించి వాయిదా వేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ అయోమయానికి నిదర్శనమని వారంటున్నారు. కనుక పర్యటన ఫలితం.. ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close