త్రివిక్ర‌మ్ క‌థ‌తో.. ఓ చిన్న సినిమా?

ద‌ర్శ‌కులు మ‌రో సినిమాకి క‌థ‌లు ఇవ్వ‌డం తెలుగు చిత్ర‌సీమ‌లో త‌ర‌చూ క‌నిపించే విష‌య‌మే. మారుతి, పూరి, క్రిష్ లాంటి ద‌ర్శ‌కులు కొన్ని చిత్రాల‌కు క‌థ‌లు అందించారు. ఇప్పుడు త్రివిక్ర‌మ్ కూడా ఓ క‌థ రాస్తున్నాడు. ఓ చిన్న సినిమా కోసం.

అవును… త్రివిక్ర‌మ్ లాంటివాళ్ల ద‌గ్గ‌ర చాలా ఐడియాలు ఉంటాయి. అయితే అవన్నీ సినిమాలుగా మార‌క‌పోవొచ్చు. త‌మ‌కున్న క్రేజ్‌కీ, త‌మ‌పై ఉన్న అంచ‌నాల‌కూ… ఆ క‌థ‌లు సూట్ కాక‌పోవచ్చు. కాక‌పోతే ఆ క‌థ‌ల్ని మ‌రో ద‌ర్శ‌కుడికి ఇచ్చి సినిమాలుగా రూపొందించే అవ‌కాశ‌మైతే ఉంది. ఇప్పుడు త్రివిక్ర‌మ్ కూడా అదే చేస్తున్నాడు. ఓ సినిమాకి త‌న క‌థ అందివ్వ‌బోతున్నాడ‌ని టాక్‌. హారిక హాసిని సంస్థ త్వ‌ర‌లో తెర‌కెక్కించే ఓ కొత్త చిత్రానికి త్రివిక్ర‌మ్ క‌థ అందిస్తార‌ని, ఈ సినిమాలో అంతా కొత్త‌వాళ్లే న‌టిస్తార‌ని, ద‌ర్శ‌కుడిగా కూడా కొత్త‌వారికే అవ‌కాశం ఇస్తార‌ని టాక్‌. హారిక హాసిని అంటే త్రివిక్ర‌మ్ సొంత సంస్థ లాంటిదే. కాబ‌ట్టే క‌థ‌ని ఇస్తున్నార‌న్న‌మాట‌. త్రివిక్ర‌మ్ క‌థ‌తో సినిమా అంటే… క్రేజీగానే ఉంటుంది. మ‌రి… ఆ క‌బురు ఎప్పుడు చెబుతారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close