ఈ రెండు సినిమాల‌కూ లింకెక్క‌డ విష్ణూ…?

ఢీ త‌ర‌వాత అడ‌పా ద‌డ‌పా ఓ హిట్టు, యావ‌రేజూ అంటూ అప్పుడ‌ప్పుడూ మెరిశాడు గానీ, త‌న‌దైన మార్కు చూపించ‌లేక‌పోయాడు విష్ణు. కొన్నాళ్లుగా సినిమా తీసే సాహ‌స‌మే చేయ‌లేదు. ఎట్ట‌కేల‌కు మోస‌గాళ్లు అనే సినిమా ప‌ట్టాలెక్కించాడు. ఈ సినిమాకి ఏమాత్రం బ‌జ్ లేదు. టీజ‌రో, ట్రైల‌రో వ‌చ్చి షాకింగ్‌గా అనిపిస్తే త‌ప్ప‌, ఈ సినిమా గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఏదోలా ఈ సినిమాకి క్రేజ్ తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు విష్ణు. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.20 నుంచి 30 కోట్ల లోపే. ఆ సినిమానే ఎలా లాక్కురావాలా అని స‌త‌మ‌త‌మ‌యిపోతుంటే.. ఇప్పుడు వంద కోట్ల సినిమాని నెత్తిమీద వేసుకోవాల‌ని చూస్తున్నాడు.

`క‌న్న‌ప్ప‌`అనే స్క్రిప్టు విష్ణు ద‌గ్గ‌ర ఎప్ప‌టి నుంచో ఉంది. త‌నికెళ్ల భ‌ర‌ణి రాశారు. ఈ సినిమాకి ఆయ‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఈ సినిమాకి రూ.60 నుంచి 70 కోట్ల బ‌డ్జెట్ అవుతుంద‌ని తెలిసి, అంత భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని నేను మోయ‌లేనంటూ ఆయ‌న త‌ప్పుకున్నారు. ఆ త‌ర‌వాత కొంత‌మంది హాలీవుడ్ టెక్నీషియ‌న్లు రంగ ప్ర‌వేశం చేశారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని తీస్తే.. వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని భావించారు. దాంతో బ‌డ్జెట్ మ‌రింత పెరిగింది. విష్ణుతో అంత బ‌డ్జెట్ రిస్క్ అని చెప్పి ఆ క‌థ‌ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు.

ఇప్పుడు మ‌ళ్లీ ఈ సినిమాపై విష్ణు మ‌న‌సు మ‌ళ్లింది. ఈసారి బ‌డ్జెట్ మ‌రింత పెరిగింది. దాదాపు వంద కోట్లు అవుతుంద‌ని లెక్క గ‌ట్టారు. మోస‌గాళ్లు సినిమా హిట్ట‌యితే త‌ప్ప‌కుండా కన్న‌ప్ప తీస్తాన‌ని అంటున్నాడు విష్ణు. మోస‌గాళ్లు 30 కోట్ల లోపు సినిమా. అది ఎంత హిట్ట‌యినా ఆ డ‌బ్బుని తిరిగి సంపాదించ‌డ‌మే ఎక్కువ‌. ఎంత సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసినా, విష్ణు స‌డ‌న్‌గా వంద కోట్ల హీరో అయిపోలేడు క‌దా…? అలాంట‌ప్పుడు మోస‌గాళ్లు సినిమాకీ, క‌న్న‌ప్ప‌కీ లింకెక్క‌డ కుదురుతుంది? పాన్ ఇండియా స్థాయిలో తీస్తే ఆ డ‌బ్బులు వ‌సూలు చేయ‌డం అంత క‌ష్ట‌మేమీ కాద‌న్న‌ది విష్ణు వాద‌న‌. చిరంజీవి లాంటి వాళ్లే పాన్ ఇండియా స్థాయికి వెళ్ల‌లేక, ఆపసోపాలు ప‌డుతున్నారిక్క‌డ‌. విష్ణు వ‌ల్ల అవుతుందా??

క‌న్న‌ప్ప క‌థ‌ని న్యూజిలాండ్‌లో తీస్తాన‌ని, హాలీవుడ్ టెక్నీషియ‌న్ల‌ని తీసుకొస్తాన‌ని, అందుకే అంత బ‌డ్జెట్ అవ‌స‌రం అవుతుంద‌ని లెక్క‌గ‌డుతున్నాడు విష్ణు. మ‌న ద‌గ్గ‌ర కూడా చాలా టాలెంట్ ఉంది. వాళ్ల‌ని వెదికి ప‌ట్టుకుని, త‌న‌కున్న మార్కెట్ రేంజులో ఈ సినిమాని తీసుకొవొచ్చు. లేదంటే బ‌డ్జెట్ భ‌యాలు, మార్కెట్ లెక్క‌ల మ‌ధ్య‌… త‌న క‌ల‌ల ప్రాజెక్టు క‌ల‌గానే ఉండిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖాతాల్లో డబ్బులేయలేదు ..డ్రామాలే !

ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం...

ఎంపీని చేస్తానని తల్లిని కూడా మోసం చేసిన జగన్ : షర్మిల

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించ పరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని..డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారని జగన్ విమర్శలు...

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close