రాజ‌మౌళిని ఫాలో అవుతున్న‌ నాగ అశ్విన్‌

మ‌హాన‌టి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌ది మెట్లెక్కాడు నాగ అశ్విన్‌. ఇప్పుడు ఎవ్వ‌రూ ఊహించ‌ని రీతిలో ప్ర‌భాస్ తో సినిమా చేసే అవ‌కాశాన్ని అందుకున్నాడు. వైజ‌యంతీ మూవీస్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించనుంది. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్ద‌నున్నారు. ప్ర‌స్తుతం న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల ఎంపిక జ‌రుగుతోంది.

ఈ సినిమా విష‌యంలో రాజ‌మౌళి ఫార్ములాని ఫాలో అవ్వ‌బోతున్నాడ‌ట నాగ అశ్విన్‌. సినిమా ప్రారంభానికి ముందు క‌థ చూచాయిగా చెప్పి, ప్రేక్ష‌కుల్ని ప్రిపేర్ చేయ‌డం రాజ‌మౌళికి అల‌వాటు. మ‌గ‌ధీర నుంచి ఇదే ఫార్ములా పాటిస్తున్నాడు. ఇప్పుడు నాగ అశ్విన్ కూడా అదే చేయ‌బోతున్న‌ట్టు టాక్‌. చిత్ర ప్రారంభోత్స‌వ స‌మ‌యంలో క‌థా విష‌యాన్ని చూచాయిగా చెప్పాల‌నుకుంటున్నాడు నాగ అశ్విన్‌. దీని వ‌ల్ల రెండు లాభాలున్నాయి. ఒక‌టి,.. ప్రేక్ష‌కుల్ని ముందే ప్రిపేర్ చేయ‌డం, రెండోది ఈ సినిమా క‌థ‌పై వ‌స్తున్న రూమ‌ర్ల‌కు చెక్ పెట్ట‌డం. నాగ అశ్విన్ క‌థ ఇదంటూ… ప్ర‌స్తుతం కొన్ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఆ పుకార్ల‌కు పుల్ స్టాప్ పెట్ట‌డం చాలా ముఖ్య‌మ‌ని భావిస్తున్నాడు నాగ అశ్విన్‌. ఈ చిత్రంలోని పాత్ర‌ల్ని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌డంలోనూ ఓ వినూత్న శైలిని ఫాలో అవ్వ‌బోతున్నాడ‌ట‌. అదేమిట‌న్న‌ది త్వ‌ర‌లో తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close