ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌వి కుక్కల‌ అరుపులు అంటున్న త‌ల‌సాని!

ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు ఎంత ఘాటుగా కౌంట‌ర్ ఇస్తే అంత గొప్ప అనుకుంటున్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు అధికార పార్టీకి చెందిన కొంద‌రు మంత్రులు. మొన్న‌నే, అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని, నాతో ప్ర‌జ‌ల్లోకి రా… ఉరికించి ఉరికించి కొడ‌తారంటూ మంత్రి ఎర్ర‌బెల్లి విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత‌, ముఖ్య‌మంత్రి క్లాస్ కూడా తీసుకున్న‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇది జ‌రిగి రెండ్రోజులైనా కాలేదు, మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ కూడా ఇలానే ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లే చేశారు.

పేద‌ల‌కు డ‌బుల్ బెడ్ రూమ్ లు ఇవ్వ‌డం లేదంటూ కాంగ్రెస్, భాజ‌పా నేత‌లు లేనిపోని హ‌డావుడి చేస్తున్నారు అన్నారు మంత్రి త‌ల‌సాని. ఏదో ఒక‌టి మాట్లాడాల‌న్న ప్ర‌య‌త్న‌మే త‌ప్ప‌, వారు చేసే విమ‌ర్శ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఎవ‌రు మొద‌లుపెట్టినా వెంట‌నే అయిపోయేది కాద‌నీ, కొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. ఇళ్ల నిర్మాణం అనుకున్న వెంట‌నే రెండ్రోజుల్లో అయిపోవు క‌దా అన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆర్నెల్ల‌పాటు ఎంతో కృషి చేసి అద్భుత‌మైన బ‌డ్జెట్ త‌యారు చేశార‌న్నారు. ప్ర‌తిప‌క్ష నేతలు కుక్క‌ల్లా అరుస్తున్నార‌నీ, వాళ్ల‌లా తాము వ్య‌వ‌హ‌రించ‌లేమ‌ని ఎద్దేవా చేశారు.

ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కుల‌కు క‌నీస మ‌ర్యాద ఇవ్వాల్సి ఉంటుంది క‌దా! మ‌రీ ఈ స్థాయిలో వారిని పోల్చి విమ‌ర్శించ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ‌ది కాదు. రాజ‌గోపాల్ రెడ్డి మీద ఎర్ర‌బెల్లి అతిగా మాట్లాడి అభాసుపాలు కావ‌డంతో ఆయ‌న‌కి ప్రాధాన్య‌త పెంచిన‌ట్ట‌యింద‌ని తెరాస నేత‌లు మొన్న‌ట్నుంచీ మ‌థ‌న‌ప‌డిపోత‌న్నారంటూ క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు త‌ల‌సాని వ్యాఖ్య కూడా అలాంటిదే. ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌కు అంశాల‌వారీగా, ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల్ని చూపించి ఎదుర్కొవాలి. అంతేగానీ, ఇలా వ్య‌క్తిగ‌త స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తే అంతిమంగా సొంత పార్టీ ప్ర‌తిష్ఠ‌త‌కే దెబ్బ‌!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close