అంతా ఓకే.. మరి బడ్జెట్ సంగతేంటి..?

ఏడాది మొత్తం టార్గెట్లను పెండింగ్ పెట్టుకుని.. మార్చి నెలాఖరుకు టార్గెట్‌లన్నీ పూర్తి చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెచ్చి పెట్టుకుంది. మార్చి 31లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వ నిధులు రావని.. ఆ లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. మరి అదే మార్చి 31వ తేదీలోపు బడ్జెట్ ఆమోదం పొందకపోతే… ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టీ ఖర్చులకు కూడా నిధులు డ్రా చేసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఉండదు. ఇప్పుడుఇదే వైసీపీలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకూ ఎన్నికలు ఉన్నాయి. రెండో విడత పంచాయతీ ఎన్నికలు 29న జరగనున్నాయి. అప్పటి వరకూ మంత్రులు, ఎమ్మెల్యేలకు క్షణం తీరిక ఉండదు. ఎందుకంటే.. వారికే బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ పెట్టినా వారు వచ్చేది తక్కువే.

మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఎన్నికల నిర్వహణలో మునిగి తేలుతూండగా.. ఆర్థిక శాఖ అధికారులు మాత్రం… బడ్జెట్ టెన్షన్‌కు గురవుతున్నారు. నిజానికి బడ్జెట్ పెట్టడం.. ఆమోదించుకోవడం పెద్ద విషయం కాదు. బడ్జెట్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. సంక్షేమ పథకాలకు కేటాయింపులు తప్ప.. కొత్తగా ఏమీ ఉండవు కాబట్టి.. పెద్దగా బడ్జెట్ కసరత్తు చేసిందేమీ లేదు. కానీ ఆమోదం పొందాలంటే మాత్రం.. అసెంబ్లీ సమావేశం అవ్వాలి. అది ఇప్పుడు సాధ్యం కాదు. దీని కోసం అధికార పార్టీ నేతలు కొన్ని వ్యూహాలు అమలు చేస్తున్నారు. సాధారణంగా మార్చి 31లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ బడ్జెట్ ప్రవేశ పెట్టాలి. వెంటనే ఆమోదం సాధ్యం కాదనుకుంటే… మూడు నెలల ఖర్చులకు ఆమోదం పొంది… నిధుల విడుదలకు ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు.

ఓటాన్ అకౌంట్‌ను అత్యవసర పరిస్థితుల్లోనే పెడతారు. ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలు అత్యవసర పరస్థితిగానే మారాయి. అందుకే.. ఓటాన్ అకౌంట్ లేదా.. రెండు నెలలకు అడ్వాన్సుడ్ బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. చివరి విడత పంచాయతీ ఎన్నికలు ముగియక ముందే అంటే.. ఈ నెల 28 నుంచి అసెంబ్లీని పెట్టాలనుకుంటున్నారు. ఆ రోజు గవర్నర్ ఉభయసభల సంయుక్త ప్రసంగం తర్వాత వాయిదా పడుతుంది. 31వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే.. చర్చ లేకుండా ఆదే రోజు ఆమోదించుకోవడం కష్టం కాబట్టి… రెండు నెలల పద్దులకు మాత్రం ఆమోదం తీసుకుంటే సరిపోతుదంని భావిస్తున్నారు. ఎలా చేసినా… నిధుల ఖర్చు కోసం ఆమోదం మాత్రం పొందాల్సిన పరిస్థితి. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

గుర్తుకొస్తున్నారు గురువు గారూ!!

ఇండ‌స్ట్రీలో స్టార్లు, సూప‌ర్ స్టార్లు చాలామంది ఉన్నారు. లెజెండ్లు, సెల‌బ్రెటీల‌కైతే లెక్కేలేదు. కానీ గురువు ఒక్క‌రే. ఆయ‌నే దాస‌రి... దాస‌రి నారాయ‌ణ‌రావు. ఇండ‌స్ట్రీ మొత్తం గురువుగారూ.. అనిపిలుచుకొనే వ్య‌క్తి.. ఒకే ఒక్క దాస‌రి. ద‌ర్శ‌కుడిగా ఆయ‌నేంటి? ఆయ‌న ప్ర‌తిభేంటి?...

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close