2017 నాటి ఫోటోతో ప్రమాద వార్త అల్లేసిన సాక్షి

మాచర్లలో ఏం జరిగిందో.. దశ్యాలతో సహా.. ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేసింది. దాడులు చేసిన వారెవరో కూడా.. గుర్తు పట్టింది. వాళ్ల ట్రాక్ రికార్డు అంతా ఎలక్ట్రానిక్ మీడియా.. సోషల్ మీడియా బయటకు తీసింది. కానీ సాక్షి మాత్రం.. టీడీపీ నేతల కారు ఓ వికలాంగుడ్ని ఢీకొన్నదని.. స్థానికులు ఆగ్రహంగా వారిపై దాడి చేశారని.. ప్రచారం చేసింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేశారు. దాని కోసం ఓ ఫోటోను కూడా వాడారు. వెంటనే.. సోషల్ మీడియా అది 2017లో జరిగిన ప్రమాదం ఫోటో అని బయట పెట్టింది. నిజానికి ఆ సమయంలో… టీడీపీ నేతలు వెళ్లిన రూట్లో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పలేదు. చివరికి హోంమంత్రి కూడా చెప్పలేదు. కానీ సాక్షి మాత్రం.. 2017 నాటి ఫోటోను మొదటి పేజీలో ప్రచురించేసింది. అది టీడీపీ నేతలు చేసిన యాక్సిడెంట్ అని చెప్పింది.

సాక్షి జర్నలిస్టు ప్రమాణాల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ అసలు ప్రమాదమే జరగకుండా.. జరిగినట్లుగా చెప్పడానికి.. ఓ పాత ఫోటోను వాడేసుకుని..అదీ కూడా.. అందరికీ తెలిసిపోయి.. సోషల్ మీడియాలో వైరల్ అయిన పిక్‌ను వాడేసుకోవడం.. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. తమ పత్రికను చదివే పాఠకులు.. తాము ఏది చెబితే.. అదే నమ్మేస్తారన్న గుడ్డి నమ్మకంతో.. సాక్షి ఉన్నట్లుగా ఉంది. ఆ పత్రిక ఎడిటోరియల్ స్టాఫ్ కూడా.. ఈ విషయంలో అదే నమ్మకంతో ఉన్నట్లుగా ఉన్నారు. అక్కడ ప్రమాదం జరిగిదే.. స్థానికే దాడి చేసి ఉంటే… ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అందరికీ తెలుసు.

సరే.. సాక్షి మీడియా జగన్ ది కాబట్టి.. వైసీపీ కి తగ్గట్లుగా వార్తల్ని బయాస్ చేసుకోవాల్సిన అవసరం బాధ్యత.. ఆ పత్రిక ఎడిటోరిలయ్ స్టాఫ్ కు ఉండొచ్చు. కానీ ఇంత దారుణంగా… పాత ఫోటోలతో బయాస్ చేస్తే.. పోయేది జగన్ పరువే కానీ.. ఆ పని చేసిన జర్నలిస్టులది కాదు. ఈ విషయాన్ని ఎడిటోరియల్ స్టాఫ్ గుర్తిస్తారో.. లేకపోతే.. పోయేది పైవాళ్ల పరువే కదా అని లైట్ తీసుకుంటారో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close