మీడియా వాచ్ : మారిపోయిన టీవీ9 లోగో..!

నెంబర్ వన్ తెలుగు టీవీ చానల్ టీవీ9 లోగో మారిపోయింది. బ్లూ, రెడ్ కలర్ మీద.. టీవీ9 అనే లోగో ఉండేది. ఇప్పుడు దాని కింద.. తెలుగులో.. తెలుగు అని పెట్టి.. డిజైన్ మార్చారు. మౌలికంగా… రంగుల్లో కానీ.. డిజైన్‌లో కానీ వచ్చిన మార్పు.. టీవీ9 కింద.. తెలుగు అని పెట్టడమే. టీవీ లోగో వివాదం రవిప్రకాష్‌ను.. చానల్ నుంచి బయటకు పంపేసినప్పటి నుండి ఉంది. కొన్నాళ్ల క్రితం.. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను పోలీసులు లోగో వివాదంలోనే కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ” టీవీ9కి చెందిన లోగోలన్నింటినీ.. రూ. 99వేలకు మోజో టీవీ ఎండీ హరికిరణ్‌కు అమ్మేశారని..” ఆ కేసు సారాంశం. దానికి సంబంధించిన వివాదాలు .. సంబంధిత న్యాయస్థానాల్లో ఉన్నాయి. ఆ లోగోలు తనవేనని రవిప్రకాష్ వాదిస్తున్నారు.

లోగోలపై.. రవిప్రకాష్‌కు సంపూర్ణ హక్కులు ఉన్నాయన్న అభిప్రాయం మొదటి నుంచి ఉంది. ఓ వాదన.. కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఎందుకంటే.. రవిప్రకాష్… ఏబీసీఎల్ వ్యవస్థాపక సభ్యుడు. వెంచర్ క్యాపిటలిస్ట్ అయిన శ్రీనిరాజు.. మొదట్లో పెట్టుబడి మాత్రమే పెట్టారు. ఆ సందర్భంగా చేసుకున్న అగ్రిమెంట్లలో మేథోపరమైన అంశాలపై.. అంటే.. లోగోల్లాంటివి.. తనకే హక్కులు ఉండేటట్లుగా… రవిప్రకాష్ ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రకారమే.. లోగోలను అమ్మేశారన్న వాదన రవిప్రకాష్ వర్గం వినిపిస్తోంది. ఈ వివాదాల్లో ఎప్పటికైనా.. లోగోలు.. రవిప్రకాష్‌కే చెందుతాయని నిపుణులు చెప్పడంతోనే..ఇప్పుడు టీవీ9 యాజమాన్యం కొత్త లోగోలను సిద్ధం చేసుకుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఒక వేళ నిజంగా.. టీవీ9 లోగో మారడానికి రవిప్రకాష్‌తో ఉన్న ఇబ్బందులే కారణం అయితే… తర్వాత ఎప్పుడైనా రవిప్రకాష్ మళ్లీ ఫాంలోకి వచ్చి కొత్త చానల్ ప్రారంభిస్తే.. దానికి టీవీ9 పాతలోగోని వాడితే మాత్రం.. టీవీ9 వర్సెస్ టీవీ9 తెలుగు అన్నట్లుగా పరిస్థితి మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైతే రవిప్రకాష్ ..వైపు నుంచి చానల్ పెడతారో లేదో క్లారిటీ లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close