ఇప్పుడు చ‌ర‌ణ్ వంతు… రూ.70 ల‌క్ష‌లు

ఏ విష‌యంలోనైనా స‌రే, ప‌వ‌న్ క‌ల్యాణ్ బాట‌లో న‌డ‌వ‌డానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు రామ్ చ‌ర‌ణ్‌. ఇప్పుడూ అంతే. క‌రోనా బాధితుల స‌హాయార్థం బాబాయ్ ప‌వ‌న్ కల్యాణ్‌ రూ.2 కోట్ల స‌హాయం ప్ర‌క‌టించిన వెంట‌నే.. తన వంతుగా విరాళం ప్ర‌క‌టించేశాడు. కేంద్ర ప్ర‌భుత్వానికీ, రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కూ 70 ల‌క్ష‌లు అందించ‌బోతున్న‌ట్టు ట్వీట్ చేశాడు. ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌కు స్ఫూర్తినిచ్చారంటూ.. ట్వీట్‌లో పేర్కొన్నాడు చ‌ర‌ణ్‌. క‌రోనాని అరిక‌ట్ట‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌లు హ‌ర్ష‌ణీయ‌మ‌ని, వాటిని త‌న వంతుగా సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తున్నాన‌ని ట్వీట్ చేశాడు రామ్ చ‌ర‌ణ్‌. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే ప‌వ‌న్ కల్యాణ్‌.. చ‌ర‌ణ్‌ని అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. మ‌రోవైపు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి సైతం త‌న వంతుగా రూ.10 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.5 ల‌క్ష‌లు ఇస్తామ‌న్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...
video

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్‌: లెక్క‌లు స‌రిచేసే రాబిన్ హుడ్‌

https://www.youtube.com/watch?v=4TriF7BfHyI ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ రాజ‌కీయాలు, ఇత‌ర సినిమాల బిజీ వ‌ల్ల‌... 'వీర‌మ‌ల్లు'కి కావ‌ల్సిన‌న్ని డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. దాంతో ఈ సినిమా పూర్త‌వుతుందా,...

వృద్ధాప్య పెన్షన్ – జగన్‌ను ముంచిన సలహాదారుడెవరు ?

2014లో తాను సీఎం అయ్యే నాటికి రూ. 200 ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ....

ఒక్క కేసీఆర్ మాటలే వినిపించాయా – అదీ నెల తర్వాత !

కేసీఆర్‌ ప్రచారంపై ఈసీ రెండు రోజులు బ్యాన్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అన్ని పార్టీల నేతల్లోనూ కేసీఆర్ మాటల్ని ఈసీ ఇంత సీరియస్ గా తీసుకుందా అన్న డౌట్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close