ఆ ఆడియో తనది కాదంటున్న సీబీఐ మాజీ జేడీ..!

అందరూ.. ఇంటి పట్టునే ఉండే సిట్యూయేషన్ . దీన్ని రాజకీయంగా కొంత మందిని బద్నాం చేయడానికి.. కరోనాపై పానిక్‌ను మరంతగా వ్యాపింపచేయడానికి వాడేసుకుంటున్నారు… కొంత మంది తెలివి మీరిన వాళ్లు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ చెప్పిన విషయాలంటూ.. ఓ ఆడియోను.. వైరల్ చేశారు కొంత మంది. ఇందులో కరోనా అనే వైరస్ గురించి.. భయంకరంగా వీవీ లక్ష్మినారాయణ చెప్పినట్లుగా ఉందంటున్నారు. ఈ ఆడియో వ్యవహారం వీవీ లక్ష్మినారాయణ దృష్టికి వెళ్లడంతో.. వెంటనే స్పందించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫేక్ ఆడియోలు.. సర్క్యూలేట్ చేయడం కరెక్ట్ కాదని ఖండించారు. కరోనా గురించి.. ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా వివరించారు.

వీవీ లక్ష్మినారాయణ పేరుతోనే.. ఆ ఆడియో ఎందుకు బయటకు వచ్చిందో.. ఎవరికీ అర్థం కాలేదు కానీ.. ఆయన ఇమేజ్ ను వ్యక్తిగతంగా డామేజ్ చేసే ప్రయత్నంలో భాగంగానే.. ఇలాంటి పనులు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కల్యాణ్ సినిమాలలో నటించడం ప్రారంభించిన తర్వాత.. తనకు నచ్చలేదని చెబుతూ.. వీవీ లక్ష్మినారాయణ జనసేనకు రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజకీయాల గురించి పట్టించుకోకుండా.. తన స్వచ్చంద సంస్థ ద్వారా.. కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే.. హఠాత్తుగా ఆయన కరోనాపై వివాదాస్పదంగా మాట్లాడారంటూ.. ఆయనపై వివాదం సృష్టించే ప్రయత్నం జరిగింది.

వీవీ లక్ష్మినారాయణ.. వివాదాస్పదంగా మాట్లాడే వ్యక్తి కాదు. వ్యక్తిగతంగానూ.. రాజకీయంగానూ ఆయన హద్దులు ఎప్పుడూ దాటలేదు. దాంతో.. ఆ ఆడియో ఫేక్ అని చాలా మందికి అర్థం అయిపోయింది. అయితే.. కామ్‌గా ఉంటే.. తనదే అనుకుంటారన్న ఉద్దేశంతో.. వీవీ లక్ష్మినారాయణ వివరణ ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కరోనా టైంలోనూ… ఉత్సాహం ఎక్కువైన రాజకీయ పార్టీల కార్యకర్తలు చాలా బిజీగా ఉంటున్నారని.. వీవీ లక్ష్మినారాయణ ఫేక్ ఆడియో ద్వారా తేలిపోతుందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ బ్యాండేజీ.. మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

అదేదో యాడ్‌లో చెప్పిన‌ట్టు.. 'ఏపీలో ఏం న‌డుస్తోంది' అంటే 'బ్యాండేజీల ట్రెండ్ న‌డుస్తోంది' అంటారు అక్క‌డి జ‌నం. ప్ర‌చార స‌భ‌లో జ‌గ‌న్‌పైకి ఎవ‌రో ఓ అగంత‌కుడు గుల‌క‌రాయి విసిరిన ద‌గ్గ‌ర్నుంచీ ఈ బ్యాండేజీ...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close