వాలంటీర్ల వ్యవస్థ గురించి కొడాలి నానికి తెలియదా.!?

కరోనా విజృంభిస్తున్న సమయంలో.. ఇంటింటికి రేషన్ ఎలా డోర్ డెలివరీ చేస్తామని.. మంత్రి కొడాలి నాని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. రేషన్ కార్డు ఉన్న వారికి ఐదు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తున్న ఏపీ సర్కార్.. వాటిని రేషన్ దుకాణాలకు వచ్చి తీసుకోవాలని షరతు పెట్టింది. దీంతో రేషన్ దుకాణాల వద్ద పెద్ద ఎత్తున పేదలు గుమికూడుతున్నారు. ఎండలో నిలబడి వడదెబ్బ కారణంగా లేక… విశాఖ జిల్లాలో ఓ మహిళ కూడా మృతి చెందింది. ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మూడున్నర లక్షల మంది వాలంటీర్లను నియమంచి .. ప్రభుత్వ పథకాల్నీ ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం .. అత్యంత క్లిష్ట సమయంలో మాత్రం ప్రజల్ని రేషన్ షాపులకు రావాల్సిందేనని చెప్పడంోత.. గగ్గోలు రేగింది. ప్రతిపక్షాలన్నీ తీవ్ర విమర్శలు చేయడంతో.. కొడాలి నాని… ” ఇంటింటి రేషన్ సరఫరాకు.. కరొనా వ్యాప్తి”కి లింక్ పెడుతూ మీడియా ముందుకు వచ్చారు.

ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను సూపర్‌గా ప్రమోట్ చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్‌మీట్ పెట్టినా.. వాలంటీర్లకు హ్యాట్సాఫ్ చెబుతూంటారు. ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ ఉన్నారని.. వారు ఆ ఇళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నారని .. గొప్ప సేవ చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు. వాలంటీర్లతో ఇప్పుటికి మూడు సార్లు ఇంటింటి సర్వే చేశామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అందే కాదు.. ప్రభుత్వ పథకాలన్నీ ఆ వాలంటీర్ల ద్వారనే ఇళ్లకు పంపుతున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో రేషన్ ను.. వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు. మార్చి ఒకటో తేదీన… ఉదయం మూడు గంటల నుంచి.. మధ్యాహ్నం ఒంటి గంటలోపే.. లక్షల పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వమే ఘనంగా ప్రకటించుకుంది.

అయితే.. ఇవేమీ తెలియనట్లుగా ఇప్పుడు.. కొడాలి నాని.. కరోనా వ్యాప్తి జరుగుతున్న సమయంలో.. ఇంటింటికి డోర్ డెలివరీ ఎలా చేస్తామని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. అలా చేస్తే కరోనా వ్యాప్తి చెందుతుందన్న విచిత్రమైన వాదనను.. వినిపించే ప్రయత్నం చేశారు. రేషన్ షాపుల ముందు గుంపులు గుంపులుగా జనం నిలబడటం కన్నా.. అది ప్రమాదకరం ఎలా అవుతోంది ప్రశ్న వస్తోంది. అది మాత్రమే డోర్ డెలివరీ విధానాన్ని ఇంకా ప్రారంభించలేదని.. మంత్రి కొడాలి నాని చెబుతున్నారు. కానీ.. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి ఎనిమిది నెలలు అవుతోంది. ఒక్కో నెలలో ఒక్కో జిల్లా నుంచి ప్రారంభిస్తామని చెప్పిన ఇంత వరకూ ప్రారంభించలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలోనైనా ప్రారంభించవచ్చు కదా అనే సందేహాలు చాలా మందిలో వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close