ఫ్లాష్ బ్యాక్‌: క‌థ చెప్ప‌కుండానే సినిమా తీసేశారు

వంశీ మేకింగ్ స్టైల్ డిఫ‌రెంట్ గా ఉంటుంది. ఆయ‌న సినిమాల్లో పాట‌ల ద‌గ్గ‌ర్నుంచి, ఫ్రేమింగుల వ‌ర‌కూ అన్నీ కొత్త‌గా క‌నిపిస్తాయి. హీరోల్ని, హీరోయిల్నీ ఒప్పించే విష‌యంలోనూ ఆయ‌న డిప‌రెంటే. ఒక్కోసారి హీరోకి పూర్తి క‌థ కూడా చెప్ప‌కుండానే త‌న‌తో ప‌నిచేయ‌డానికి ‘ఐతే ఓకే..’ అనిపించేస్తుంటారు. అయితే క‌థ ఏమాత్రం చెప్ప‌కుండా.. సినిమా పూర్తి చేసేసిన సంద‌ర్భం కూడా ఉంది. అయితే అది హీరోకి కాదు, హీరోయిన్‌కి.

ఏప్రిల్ 1 విడుద‌ల సినిమా తీసే రోజుల‌వి. క‌థానాయిక పాత్ర కోసం శోభ‌న‌ని అనుకున్నారు. అప్ప‌టికే శోభ‌న చాలా బిజీ. ‘వంశీ గారూ…. క‌థ చెప్పండి. న‌చ్చితే చేస్తాను’ అంది శోభ‌న‌. కానీ వంశీకి క‌థ చెప్పే తీరిక దొర‌క‌లేదు. అంత‌లోనే సినిమా కూడా మొద‌లైపోయింది. సెట్ కి వ‌స్తారు క‌దా, అప్పుడు చెబుతాను లెండి.. అన్నారు వంశీ. శోభ‌న కూడా వంశీపై న‌మ్మ‌కంతో స‌రే అంది. సెట్లో ఏమాత్రం ఖాళీ దొరికినా.. ‘వంశీగారూ.. క‌థ చెప్పండి’ అంటూ శోభ‌న అడిగేది. కానీ.. వంశీ క‌థ చెప్పేలోగా.. ఏదో ఓ చిన్న స‌మ‌స్య వ‌చ్చి ప‌డేది. రోజులు, వారాలూ గ‌డుస్తున్నాయి. `అస‌లు ఈయ‌న ఏం తీస్తున్నాడు?’ అనే డౌటూ.. శోభ‌న‌ని వెంటాడేది. చివ‌రికి ఓరోజు… ఏదైతే అదే అయ్యింద‌ని ”ఈరోజు నాకు క‌థ చెబుతారా, లేదా” అంటూ వంశీని నిల‌దీసింద‌ట శోభ‌న‌. విచిత్రం ఏమిటంటే స‌రిగ్గా అదే రోజు… సినిమా షూటింగ్ అయిపోయి, పేక‌ప్ కూడా చెప్పేశారు. ఇదే విషయం శోభ‌న‌కు చెబితే… `అయ్యో వంశీగారూ.. నాకు క‌థ చెప్ప‌కుండానే సినిమా పూర్తి చేసేశారే..` అంటూ న‌వ్వేసింద‌ట‌. ఆ సినిమా సూప‌ర్ హిట్ట‌య్యింది. వంశీ టేకింగు, ఇళ‌య‌రాజా పాట‌ల‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. రాజేంద్ర ప్ర‌సాద్‌కి ఎంత మంచి పేరొచ్చిందో, శోభ‌న‌కూ అంతే గుర్తింపు ద‌క్కింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంగ్లిష్ మీడియం కోసమూ సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్..!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న ఏపీ సర్కార్.. సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో...

కృష్ణా బోర్డు భేటీలో ఎప్పటి వాదనలే.. ఎప్పటి వాటాలే..!

కృష్ణా నద యాజమాన్య బోర్డు భేటీలో ఆరు గంటలు వాదోపవాదాలు చేసుకున్నా..చివరికి మొదటికే వచ్చారు రెండు రాష్ట్రాల అధికారులు. ఇద్దరి వాదనలుక..కేఆర్ఎంబీ బోర్డు.. డీపీఆర్‌లు సమర్పించాలనే సూచనతో ముగింపునిచ్చింది. డీపీఆర్‌లు...

తూచ్.. విజయ్‌ మాల్యాను అప్పగించరట..!

విజయ్ మాల్యాను అప్పగించడం లేదని బ్రిటన్ ప్రభుత్వం తేల్చేసింది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి కాలేదని.. చట్ట లాంచనాలు పూర్తి చేయాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అవి ఏమిటో..ఎప్పుడు పూర్తవుతాయో..మాత్రం చెప్పడం లేదు....

బాల‌య్య ఇంట్లో విందు… చిరు వ‌స్తాడా?

జూన్ 10... బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఈసారి పుట్టిన రోజు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఇది ఆయ‌న ష‌ష్టి పూర్తి మ‌హోత్స‌వ సంవ‌త్స‌రం. అందుకే ఈ పుట్టిన రోజుని కాస్త ప్ర‌త్యేకంగా జ‌రుపుకోవాల‌ని బాల‌య్య...

HOT NEWS

[X] Close
[X] Close