ప్ర‌భాస్ కోసం ఆసుప‌త్రి క‌ట్టేస్తున్నారు

ప్ర‌భాస్ – రాధాకృష్ణ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే క‌థానాయిక‌. ఈ చిత్రానికి ‘జాన్‌’ అనే పేరు పెట్టాల‌నుకున్నారు. ఆ త‌రవాత ‘రాధే శ్యామ్‌’ అనే పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ‘ఓ డియ‌ర్’ మ‌రో ఆప్ష‌న్‌. ఉగాదికి ఫ‌స్ట్ లుక్ గానీ, టైటిల్ గానీ బ‌య‌ట‌కు వ‌స్తుంద‌నుకున్నారు. కరోనా ఎఫెక్ట్ వ‌ల్ల ఆ సంద‌డి వాయిదా ప‌డింది.

ఇట‌లీ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. సినిమా మొత్తం అక్క‌డే జ‌ర‌గాలి. దాదాపు 30 శాతం షూటింగ్ అక్క‌డే జ‌రిగింది. ఇండోర్ స‌న్నివేశాల్ని ఇక్క‌డ తీశారు. ఇప్పుడు క‌నోరా ఎఫెక్ట్ వ‌ల్ల విదేశాల్లో షూటింగ్ చేసే ప‌రిస్థితి లేదు. అందుకే మిగిలిన సినిమా కూడా ఇక్క‌డే పూర్తి చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చారు. అందుకోసం ఇప్పుడు హైద‌రాబాద్ లో ఆసుప‌త్రి సెట్లు వేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఆసుప‌త్రి నేప‌థ్యంలో కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించాల్సివుంది. దాన్ని ఇట‌లీలోనే తీయాల‌నుకున్నారు. ఇప్పుడు ఆ స‌న్నివేశాల్ని హైద‌రాబాద్ లో సెట్లు వేసి లాగించేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే అన్న‌పూర్ణ స్టూడియోలో ఈ సినిమా కోసం రెండు మూడు పెద్ద సెట్లు తీర్చిదిద్దారు. వాటి ప‌క్క‌నే ఆసుప‌త్రి సెట్‌నీ వేయ‌బోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తూచ్.. విజయ్‌ మాల్యాను అప్పగించరట..!

విజయ్ మాల్యాను అప్పగించడం లేదని బ్రిటన్ ప్రభుత్వం తేల్చేసింది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి కాలేదని.. చట్ట లాంచనాలు పూర్తి చేయాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అవి ఏమిటో..ఎప్పుడు పూర్తవుతాయో..మాత్రం చెప్పడం లేదు....

బాల‌య్య ఇంట్లో విందు… చిరు వ‌స్తాడా?

జూన్ 10... బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఈసారి పుట్టిన రోజు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఇది ఆయ‌న ష‌ష్టి పూర్తి మ‌హోత్స‌వ సంవ‌త్స‌రం. అందుకే ఈ పుట్టిన రోజుని కాస్త ప్ర‌త్యేకంగా జ‌రుపుకోవాల‌ని బాల‌య్య...

తన హత్యకు అఖిలప్రియ కుట్ర చేసిందన్న ఏవీ సుబ్బారెడ్డి..!

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తన హత్యకు సుపారీ ఇచ్చారని..కర్నూలు టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని రోజుల క్రితం.. కడప జిల్లాలో ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర...

పుష్పశ్రీవాణి కుటుంబానికీ అభివృద్ధి కనిపించడం లేదట..!

వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి స్వరాల్లో.. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి కుటుంబం కూడా చేరింది. పుష్పశ్రీవాణి భర్త పరీక్షిత్ రాజు తండ్రి.. చంద్రశేఖరరాజు మీడియా సమావేశం పెట్టి మరీ అభివృద్ధి జరగడం లేదని.. మండిపడ్డారు....

HOT NEWS

[X] Close
[X] Close