అమెరికా “వుహాన్” న్యూయార్క్..!

న్యూయార్క్… ఈ పేరులో ఓ వైబ్రేషన్ ఉంటుంది. ప్రపంచంలో ఈ సిటీ గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచంలోని వింతలు విశేషాలు గురించి చెప్పాలంటే… టైమ్స్ స్క్వేర్ నుంచే ప్రారంభించాల్సి ఉంటుంది. అక్కడి ప్రజల లైఫ్ స్టైల్.. అమెరికా ప్రజల విలాసానికి సింబల్‌గా ఉంటుంది. అది నిన్నటి వరకే .. ఇప్పుడు ఆ న్యూయార్క్.. కోవిడ్ -19 కోరల్లో చిక్కి.. ఆస్పత్రి పాలవుతోంది. ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇరవై నాలుగు గంటలూ బిజీగా ఉండే న్యూయార్క్ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ నిర్మానుష్యంగా ఉంటోంది.

అమెరికాలోని కోవిడ్ -19 పాజిటివ్ కేసుల్లో 42 శాతం న్యూయార్క్‌వే..!

అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు లక్షా 60వేలు దాటిపోయాయి. వీటిలో 40 శాతం న్యూయార్క్ నుంచే నమోదవుతున్నాయి. ఇప్పటికే న్యూయార్క్‌లో 60వేలు దాటిపోయాయి. 1200మందికిపైగా ప్రాణాలు కోల్పోయాయి. కరోనా వ్యాప్తి ప్రారంభమైన చైనాలోని వుహాన్‌లో పరుస్థితి మొదట్లో ఎలా ఉండేదో.. ఇప్పుడు అలాంటి పరిస్థితే న్యూయార్క్‌లో కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు.. న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూకు మధ్య సరిపడకపోవడం కూడా.. ప్రభుత్వాల సేవల్లో సమన్వయం లోపించడానికి కారణం అవుతోంది. న్యూయార్క్ మొత్తాన్ని క్వారంటైన్ చేయాలని ట్రంప్ భావించారు. కానీ ఆండ్రూ వ్యతిరేకించాు. దాంతో న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెక్టికట్‌ రాష్ట్రాలకు ట్రావెల్‌ అడ్వైజరీని మాత్రం ప్రకటించారు.

నెంబర్ వన్ వైద్య సదుపాయాలున్నా కంట్రోల్ చేయలేని పరిస్థితి..!

న్యూయార్క్ బిజినెస్‌ సెంటర్‌ కావడంతో జనసాంద్రత అధికంగా ఉంది. అందుకే చాలా వేగంగా స్టేజ్ త్రీకి చేరుకుంది. సామాజిక వ్యాప్తి విస్తృతంగా జరుగుతోంది. న్యూయార్క్‌ రాష్ట్రం పొరుగున ఉన్న రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. న్యూజెర్సీ, కనెక్టికట్‌లోనూ అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. అమెరికాలో ఈ మూడు రాష్ట్రాలే మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. అందుకే వీటికి ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేశారు. న్యూయార్క్‌ రాష్ట్రంలో వైరస్‌తో పోలీసు అధికారులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో యంత్రాంగంపైనా ఒత్తిడి పెరుగుతోంది.

వుహాన్ కోలుకుంది.. న్యూయార్క్ కోలుకుంటుందా..?

అత్యంత మెరుగైన ఆరోగ్య సదుపాయులు ఉండే దేశంగా పేరున్న అమెరికాలో అదీ న్యూయార్క్‌లో అత్యవసర సిబ్బందికి కనీసం మాస్క్‌లు, గ్లౌజ్‌లు అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆస్పత్రుల సిబ్బంది కూడా వెంటిలేటర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. అవి సరిపడనంత లేకపోవడంతో మరణాలు పెరుగుతున్నాయి. కోవిడ్ -19 వైరస్‌ దెబ్బకు న్యూయార్క్‌ నగరం స్వరూపమే మారిపోయింది. వుహాన్‌ పరిస్థితి ఇప్పుడు మెరుగుపడింది. కానీ న్యూయార్క్ పరిస్థితి మెరుగుపడుతుందా లేదా.. అన్న టెన్షన్ అమెరికాకు ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకూ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకోకూడదట..!

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకున్నట్లుగా ప్రకటించుకుని.. సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం చట్ట విరుద్ధమని తాజాగా ఏపీ ప్రభుత్వం వాదన వినిపించడం ప్రారంభించింది. సోమవారం.. ఎస్‌ఈసీగా రమేష్...

అన్‌లాక్ 1 : 8వ తేదీ నుంచి హోటళ్లు, ఆలయాలు ఓపెన్..!

దేశంలో లాక్‌డౌన్‌ను కంటెన్మెంట్‌జోన్లకే పరిమితం చేస్తూ... కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్‌ ముగింపు కోసం.. అన్‌లాక్ పాలసీని ప్రకటించింది. దీనిలో భాగంగా జూన్ ఎనిమిదో తేదీ నుంచి ఆలయాలు, హోటళ్లు,...

ఇన్ సైడ్ న్యూస్: సొంత పత్రిక , ఛానల్ ప్రారంభించడం కోసం జనసేన కసరత్తు

త్వరలోనే సొంత పత్రిక, టీవి ఛానల్ ప్రారంభించాలనే యోచన తో జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీలో క్యాడర్ నుంచే కాకుండా, పార్టీ ముఖ్య నేతల...

మోడీ సాధించే స్వావలంబనపై పవన్‌కు ఎంతో నమ్మకం..!

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో దేశం స్వయం స్వావలంబన సాధిస్తుందని.. ప్రధానమంత్రి మోడీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తరవాత గట్టిగా నమ్ముతున్న వ్యక్తి జనసేన అధినేత పవన్...

HOT NEWS

[X] Close
[X] Close