తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జాక్‌పాట్ కొట్టారు!

హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భారీస్థాయిలో జీతభత్యాలు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ దిశగా కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలకు నెలకు జీతభత్యాల రూపంలో మొత్తం రు.95,000 అందుతోంది. ఈ మొత్తాన్ని 200% పెంచబోతున్నారు. అంటే సుమారుగా నెలకు రు.3 లక్షలకు వీరి జీతభత్యాలు పెరగబోతున్నాయన్నమాట.

ఇటీవల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరు కలిసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళి జీతభత్యాలను పెంచాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. దీనిపై కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. ఢిల్లీలో ఎమ్మెల్యేలకు జీతభత్యాలను ఇటీవల రు.4 లక్షల దాకా పెంచిన విషయాన్ని ఆయనే గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రాజకీయ, రాజకీయేతర ఖర్చులు అనేకం ఉంటాయని, గ్రామాలకు, జిల్లాకేంద్రానికి, రాజధానికి తిరగాల్సి ఉంటుందని, అనేక సభలు, సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంటుందని అన్నారు. వీటన్నింటిని కలిపితే నెలకు రు.3 లక్షల వరకు వారికి ఖర్చు ఉంటుందని కేసీఆర్ అంచనా వేశారు. నిన్న దీనిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది పూర్తయిన తర్వాత మంత్రులు, స్పీకర్, కౌన్సిల్ ఛైర్మన్, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ ఛైర్మన్, ప్రభుత్వ విప్‌లు, ప్రతిపక్షనేతలు, క్యాబినెట్ హోదా ఉన్న ప్రభుత్వ సలహాదారుల జీతాలను కూడా పెంచాలని ప్రభుత్వ యోచనగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close