ఏపీ వైద్య సిబ్బందికి కరోనా గండం..! మాస్క్‌లు కూడా ఇవ్వరా..?

ఓ కాలనీ లో నివసిస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ వస్తే.. ఆ కాలనీ మొత్తాన్ని క్లీన్ చేసి.. రసాయనాలు చల్లి… రెడ్ జోన్ గా ప్రకటిస్తున్న ప్రభుత్వం.. అలాంటి రోగులు వందల మంది చికిత్స పొందుతున్న ఆస్పత్రుల్లో ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి చికిత్స చేస్తున్న వైద్యులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి..? ప్రపంచ స్థాయి పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్లు అందించాలి. కానీ.. ఈ విషయంలో వైద్యులను ఏపీ సర్కార్ గాలికి వదిలేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్ల కోసం.. వైద్యులు ఎదురు చూస్తున్నారు. కావాల్సినంతగా సరఫరా చేయడం లేదు. చివరికి కరోనా చికిత్సకు కేంద్రాలుగా మార్చిన ఆస్పత్రుల్లోనే ఈ కొరత ఉంది.

విశాఖ జిల్లాలో ఓ వైద్యుడు … తన ఆవేదనను వ్యక్తం చేసిన వీడియో వైరల్ అయింది. చాలా మంది వైద్యులు ప్రభుత్వం ఎక్కడ ఆగ్రహిస్తుందో అన్న ఉద్దేశంతో బయటకు రావడం లేదు. కానీ.. వైసీపీ నేతలు అనేక సందర్భాల్లో ఆస్పత్రులు సందర్శించినప్పుడు వెలుగు చూస్తున్న ఫోటోలు పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నాయి. ఓ మహిళా ఎమ్మెల్యే ఓ ఆస్పత్రిని సందర్శించినప్పుడు… ఎమ్మెల్యే N95 మాస్క్‌ను ధరించారు. ఆమె భద్రతా సిబ్బంది సర్జికల్ మాస్క్‌ను ధరించారు. కానీ పక్కనే ఉన్న డాక్టర్లు .. కర్చీఫ్‌లను మాస్క్‌లుగా వాడుకున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. ఆ ఫోటో నిరూపిస్తోందని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. విజయసాయిరెడ్డి ఎక్కడికి వెళ్లినా.. చివరికి ఇంట్లో ఉండి.. కాగడా వెలిగించడానికి వచ్చినా ఆయన అత్యాధునిక.. N95 మాస్క్, గ్లౌజులు వాడుతున్నారు. ఇది కూడా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైద్యుల దుస్థితిని .. విజయసాయిరెడ్డికి పీపీఏ ప్రాధాన్యాన్ని పోల్చుతూ విమర్శలు చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం.. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది విధులకు రాకపోతే ఎస్మా చట్టం అమలు చేయడానికి వైసీపీ సర్కార్ సిద్ధమయింది. అయితే.. వారికి కావాల్సిన సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదనే ఆరోపణలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కేంద్రం కొన్ని పీపీఈ కిట్లను.. పంపింది. ఈ మాస్కులు.. పీపీఏలు కొంత మంది అధికార పార్టీ నేతలు పట్టుకెళ్లిపోయారని.. ఇంగ్లిష్ మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో కలకలం రేగింది. దీనిపై వెంటనే… ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఆయుధాలు లేకుండా వైద్యులను యుద్ధానికి పంపుతున్నారని మండిపడ్డారు. వైద్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే వారు.. రోగులను కాపాడతారు. లేకపోతే.. కొలేటరల్ డ్యామేజ్ జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close