హాట్ స్పాట్లలోనే లాక్‌డౌన్..!

దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని అయినా ఈ పధ్నాలుగు తర్వాత కొన్ని జాగ్రత్తలతో లాక్‌డౌన్‌ను పాక్షికంగా సడలించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నారు. ఈ మేరకు కొన్ని ప్రతిపాదలను అధికారులు సిద్ధం చేశారు. దీని ప్రకారం.. కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను ఇప్పటికే హాట్ స్పాట్‌లుగా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ కొనసాగించాలని.. ఇతర ప్రాంతాల్లో వెసులుబాటు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదీ కూడా.. పూర్తి స్థాయిలో ఎత్తివేత కాకుడా.. సూళ్లు, షాపింగ్ మాల్స్, ధియేటర్లు ప్రారంభించకుండా.. జనం గుమికూడే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకుండా.. వ్యాపార, ఉద్యోగ కార్యకలాపాలు యధావిధిగా సాగేలా చూడాలన్న ఆలోచనలో ఉన్నారు.

లాక్ డౌన్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడే సూచనలున్నాయి. ఇది భారత్‌ను.. పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుందనే ఆందోళన ఆర్థిక నిపుణుల్లో ఉంది. హాట్ స్పాట్ కాని ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత అన్ని ఉత్పాదక, సేవా రంగాలు సాధారణ స్థాయిలో పని చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా రైతుల విషయాన్ని మోడీ ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. పంట కోతల సమయంలో సాధ్యమైనంత సాయాన్ని వారికి అందించడమే కాకుండా.. వాటిని అమ్ముకునేందుకు సాయం చేయాలని నిర్ణయించారు. అలాగే వివిధ మంత్రిత్వ శాఖలు ” వ్యాపార కొనసాగింపు ప్రణాళిక”లను సిద్ధం చేయాలని మోదీ ఆదేశించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమత్రులు లాక్ డౌన్ కొనసాగింపు కోసం పట్టుబడుతున్నారు ఇప్పుడు ప్రజల్ని రోడ్లపైకి అనుమతిస్తే ఇప్పటి వరకూ పడిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తబ్లిగీల కేసులు ఇప్పుడే బయటపడుతున్నాయి కాబట్టి.. మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ అమలు చేస్తే.. పరిస్థితి మెరుగుపడుతుందన్నఅంచనాలో ఉన్నారు. దీంతో… కేంద్రం పథ్నాలుగో తేదీ తర్వతా హాట్ స్పాట్లలోనే లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించినా.. రాష్ట్రాలు మాత్రం.. ఆ వెసులుబాటు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా...

రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ.. ఈ సారి డిప్యూటీ సీఎం..!

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై రోజా ఫైరయ్యారు. నారాయణస్వామి పుత్తూరులో పర్యటించారు. కానీ రోజాకు సమాచారం అందలేదు. పుత్తూరు .. ఆమె ఎమ్మెల్యేగా...

HOT NEWS

[X] Close
[X] Close