మాస్క్‌లు పెట్టుకుని పెళ్లి చేసుకోవ‌డ‌మేంటి?

అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే ఈవారంలోనే నితిన్ పెళ్లి జ‌రిగిపోయేది. ఈరోజు (ఆదివారం) నితిన్‌ని పెళ్లి కొడుకుని చేసేవాళ్లు. ఎంచ‌క్కా దుబాయ్‌లో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని, హైద‌రాబాద్ లో ఘ‌నంగా విందు ఇచ్చేవాడు. కానీ క‌రోనా వ‌ల్ల అన్నీ మారిపోయాయి. నితిన్ పెళ్లి వాయిదా ప‌డింది. అయినా నితిన్ బెంగ ప‌డ‌డం లేదు. బాధ ప‌డ‌డం లేదు. ”అన్నింటికంటే ప్రాణాలే ముఖ్యం. పెళ్లి అనేది గొప్ప వేడుక‌. జీవితంలో ఒక్క‌సారే జ‌రుగుతుంద‌ని దాన్ని భ‌యాల మ‌ధ్య‌న‌, మాస్కులు పెట్టి చేసుకోకూడ‌దు. అందుకే ఇష్ట‌పూర్వ‌కంగానే వాయిదా వేశా” అంటున్నాడు. లాక్ డౌన్ ముందు పెళ్లి, సినిమాలు, షూటింగులు అన్నీ చిన్న‌వే అని, ఓ సినిమా పోతే మ‌రో సినిమా చేసుకోవ‌చ్చ‌ని, డ‌బ్బులు మ‌ళ్లీ సంపాదించుకోవ‌చ్చ‌ని, ప్రాణాలు మాత్రం మ‌ళ్లీ రావ‌ని చెప్పుకొచ్చాడు నితిన్‌.

ఈ లాక్ డౌన్ వేళ అంద‌రి దిన‌చ‌ర్య‌లూ మారిపోయాయి. నితిన్ డైరీ కూడా అంతే. జిమ్‌లు క‌ట్టిపెట్టేశాడ‌ట‌. డైట్‌ని ప‌క్క‌న పెట్టి అమ్మ చేతి వంట తింటూ.. కాల‌క్షేపం చేస్తున్నాడ‌ట‌. స్నేహితులంతా వంట గ‌దిలో దూరి ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తున్నార‌ని, తాను కూడా రేపో మాపో గ‌రిట ప‌ట్టుకుంటాన‌ని అంటున్నాడు. రాత్రి రెండింటి వ‌ర‌కూ మేల్కొని సినిమాలు చూస్తున్నాన‌ని, తెల్లారి 11 గంట‌ల‌కు నిద్ర లేస్తున్నాన‌ని లాక్ డౌన్ వ‌ల్ల త‌న దిన‌చర్య మొత్తం మారిపోయింద‌ని అంటున్నాడు నితిన్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close