బొంతు కర్చీఫ్‌ రిజల్టిచ్చింది.. మేయర్‌గా ఖరారు!

మొత్తానికి మేయర్‌ స్థానాన్ని దక్కించుకోవడానికి, హైదరాబాదునగర ప్రథమ పౌరుడిగా అధికారం వెలగబెట్టడానికి వీలుగా.. పార్టీ అధిష్ఠానాన్ని సంతృప్తి పరచేందుకు కొన్ని రోజులుగా పడుతున్న పాట్లు ఫలితాన్నిచ్చాయి. గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటినుంచి… మేయర్‌ స్థానానికి తగిన కాంబినేషన్ల గురించి ఎన్ని రకాల ఊహాగానాలు సాగుతూ ఉన్నా సరే.. తనను పరిగణించాలని కోరుతూ.. ఆ సీటు మీద కర్చీఫ్‌ వేసి ప్రయత్నాలు సాగించిన బొంతు రామ్మోహన్‌ చివరికి సఫలీకృతులయ్యారు. ఆయనను మేయర్‌ అభ్యర్థిగా పార్టీ నాయకత్వం ఎంపిక చేసింది. అలాగే డిప్యూటీ మేయర్‌ స్థానాన్ని ముందే అనుకున్నట్లుగా ఒక మైనారిటీకి అప్పగించబోతున్నారు. నగరంలోని బోరబండ కార్పొరేటర్‌ ఫసియుద్దీన్‌ను ఎంపిక చేశారు.

బొంతు రామ్మోహన్‌ సుదీర్ఘ కాలంగా తెరాసతో అనుబంధం ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉంది. అయితే ఒక దశలో కార్పొరేటర్‌గానే ఆయన ఓడిపోతారనే ప్రచారం పార్టీలోనే వినిపించింది. మరో దశలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బొంతు రామ్మోహన్‌ పట్ల అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. వీటిల్లో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ.. చివరికి బొంతురామ్మోహన్‌ మేయర్‌ కాబోతున్నారు.

ఎన్నికలు పూర్తయిన నాటినుంచి బొంతు రామ్మోహన్‌ ఇదే పనిలో ఉన్నారు. కేసీఆర్‌ మీద మహిళా వ్యతిరేకిగా ఉన్న ముద్రను తొలగించడానికి మేయర్‌ స్థానాన్ని మహిళకు కట్టబెడతారనే ప్రచారం ఫలితాల తర్వాత మీడియాలో బాగా వచ్చింది.

ఆ ప్రచారం చాలా నమ్మశక్యంగా సాగింది. మహిళల్లోనే పెద్ద నాయకుల వారసులు కొందరు తమతమ ప్రయత్నాలు చేసుకునేలా ఆ ప్రచారం పురిగొల్పింది. ఈ వాతావరణం తనకు ప్రతికూలంగానే కనిపిస్తున్నప్పటికీ.. బొంతురామ్మోహన్‌ మాత్రం ఏమాత్రం నిరాశ పడకుండా.. తన ప్రయత్నాలు తాను సాగిస్తూనే వచ్చారు. తాను మేయర్‌ రేసులో ఉన్నాననే సంగతిని ఏమాత్రం దాచుకోకుండా.. పార్టీని , విజయం సాధించినందుకు కేసీఆర్‌ను, కేటీఆర్‌ను కూడా అభినందిస్తూ నగరంలో పలు ప్రాంతాల్లో పెద్దపెద్ద హోర్డింగులు కూడా ఏర్పాటు చేశాడు. ఆ రకంగా.. రేసులో ఇతరులకంటె ముందున్నాననే సంకేతాలు ఇచ్చాడు. ఈ పోకడలపై ‘మేయర్‌ పీఠంపై కర్చీఫ్‌ వేసి కూర్చున్న బొంతురామ్మోహన్‌’ అంటూ తెలుగు360 ఒక కథనాన్ని కూడా అందించింది. చివరికి ఆయన ప్రయత్నాలే ఫలించి.. ఇప్పుడు మేయర్‌ కాబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close