వైరస్ ముట్టడిలో హైదరాబాద్ ..!

మెట్రో నగరం హైదరాబాద్ వైరస్ ముప్పులో చిక్కుకుంది. ఏ మూలకు వెళ్లినా కంటెయిన్‌మెంట్ జోన్లు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా.. ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా కరోనా కట్టడికి కార్యాచరణ సిద్ధం చేశారు. హైదరాబాద్‌ను జోన్లవారీగా విభజించి.. ఒక్కో జోన్‌కు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో 17 సర్కిళ్లను 17 జోన్‌లు విభజించి.. ప్రతి జోన్‌కు ఒక నోడల్‌ అధికారి, పోలీస్‌ అధికారిని నియమించారు. వైద్యశాఖ అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని .. రోజుకు 1100 మందికి పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేయాలని స్ఫష్టం చేశారు.

పాజిటివ్ వచ్చిన వారి ద్వారా ఇతరులకు తొందరగా వ్యాపించే.. అవకాశాలు హైదరాబాద్‌లో ఎక్కువగా ఉన్నాయని.. అందుకే.. హైదరాబాద్ విషయంలో ప్రత్యేక వ్యూహం అనుసరించాలని ఆదేశించారు. తెలంగాణలో మొత్తం వైరస్ వ్యాప్తి ఉన్న ప్రాంతాలుగా గుర్తించి 246 కంటెయిన్‌మెంట్లను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే 126 కంటైన్‌మెంట్లు ఉన్నాయి. కంటైన్‌మెంట్లలోని ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి రానీయవద్దు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు కావాల్సిన నిత్యావసరాల్ని యంత్రాంగమే అందిస్తోంది.

అంతర్జాతీయ ప్రయాణికులతో పాటు.. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారు కూడా హైదరాబాద్‌లో అత్యధికం ఉంటున్నారు. వీరిలో అత్యధికం క్వారంటెన్‌ను పూర్తి చేసుకున్న వారు ఉన్నారు. అయితే. క్వారంటెయిన్ గడువు పూర్తయిన తర్వాత ఇళ్లకు వెళ్లిన చాలా మందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. కొంత మందికిపాజిటివ్ వస్తోంది. అయితే.. అప్పటికే వారి ద్వారా ఇతురలకు వ్యాపిస్తోంది. ఇదే ప్రమాదకరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close