ఫ్లాష్ బ్యాక్‌: దాస‌రిని ఎస్వీఆర్ కోపగించుకున్న వేళ‌

ఏమాట‌కామాట చెప్పుకోవాలి. దాస‌రి నారాయ‌ణ‌రావు ఉద్దండుడు. ఎవ‌ర్ని ఎలా డీల్ చేయాలో ఆయ‌న‌కు బాగా తెలుసు. అస‌లు సెట్లో ద‌ర్శ‌కుడికంటూ ఓ గౌర‌వం తెచ్చుకున్న‌ది, దాన్ని నిల‌బెట్టుకున్న‌దీ, ద‌ర్శ‌కులకు స్టార్ డ‌మ్ తీసుకొచ్చిందీ ఆయ‌నే. ఈ ల‌క్ష‌ణాలు దాస‌రిలో ముందు నుంచీ ఉన్నాయి. దాస‌రి త‌న రెండో సినిమాలోనే త‌న ప‌ట్టుద‌ల‌ని చూపించుకున్నారు.

దాస‌రి తొలి చిత్రం ‘తాత‌- మ‌న‌వ‌డు’. సూప‌ర్ హిట్‌. రెండో సినిమా.. ‘సంసారం – సాగ‌రం’. ఇందులో కూడా ఎస్వీ రంగారావు కీల‌క పాత్ర పోషించారు. అందులో కాబూలీవాలాగా క‌నిపించారు. తొలి రోజు షూటింగ్‌లోనే దాస‌రికీ, ఎస్వీఆర్‌కీ వాగ్వీవాదం జ‌రిగింది. దాస‌రి చెప్పిన చాంతాడంత డైలాగ్‌ని విన్న ఎస్వీఆర్‌.. ‘ఇంత అవ‌స‌రం లేదు.. దాన్ని క‌ట్ చేస్తా.. కుదించి చెప్తా’ అన్నార్ట‌. దానికి దాస‌రి “సార్ ఇది సినిమాలో ఆర్డ‌రు ప్ర‌కారం వ‌చ్చే 99వ సీన్‌. 98 సీన్లు రాసిన వాడిగా 99వ సీన్‌లో ఏం రాస్తే బాగుంటుందో, ఎంత రాయాలో నాకు తెలుసు. ఇంత‌కు ముందు 98 సీన్లూ ఎలా ఉంటాయో మీకు తెలీదు . అందుకే ఇలా మాట్లాడుతున్నారు” అన్నాడ‌ట‌. ఎస్వీఆర్‌కి చాలా కోపం వ‌చ్చేసింది. అప్ప‌టికి దాస‌రి వ‌య‌సు, అనుభ‌వం ఎంత‌ని. ఒకే ఒక్క సినిమా. ఇటు ఎస్వీఆర్ మామూలు వ్య‌క్తా? ఆయ‌న అనుభ‌వం ముందు దాస‌రి ఎంత‌? ఈ విష‌యం దాస‌రికీ తెలుసు. కానీ డైలాగు మార్చ‌క‌పోవ‌డం ఎస్వీఆర్‌కి కోపం వ‌చ్చేసింది. దాంతో “ఈ సినిమా నేను చేయ‌ను” అంటూ అలిగి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.

ఈ సినిమాకి కె.రాఘ‌వ నిర్మాత‌. ఆయ‌న‌కీ ఎస్వీఆర్‌కీ మంచి దోస్తీ ఉంది. ఎస్వీఆర్ మ‌న‌స్త‌త్వం ఆయ‌న‌కు బాగా తెలుసు. అందుకే ఆయ‌న స్థానంలో అప్ప‌టిక‌ప్పుడు రావుగోపాల‌రావుతో ఆ పాత్ర వేయించాల‌నుకున్నారు. వెంట‌నే రావుగోపాల‌రావు కూడా సెట్‌కి వ‌చ్చారు. కానీ అప్ప‌టికి సెట్లో ఎస్వీఆర్ కూర్చుని ఉన్నారు. రావు గోపాల‌రావు సెట్‌కి ఎందుకు వ‌చ్చాడో ఎస్వీఆర్‌కి అర్థ‌మైంది. “ఏంటి ఇలా వ‌చ్చావు?” అని గద్దిస్తూనే అడిగార్ట‌. దానికి రావుగోపాల‌రావు భ‌య‌ప‌డిపోయి.. “ఏం లేదు సార్‌… మిమ్మ‌ల్ని ప‌ల‌క‌రిద్దామ‌ని వ‌చ్చా” అని మాట మార్చి అక్క‌డి నుంచి తుర్రుమ‌న్నార్ట‌.

వెంట‌నే.. ఎస్వీఆర్ దాస‌రిని పిలిపించార్ట‌. డైలాగు మార్చే ఉద్దేశం ఉందా, లేదా? అని ఈసారి ఇంకొంచెం సీరియ‌స్ గా అడిగితే… “మీ మ‌న‌సు నొప్పించి ఉంటే క్ష‌మించండి. కానీ.. ఈ స‌న్నివేశానికి ఇంత పెద్ద డైలాగ్ అవ‌స‌రం. సినిమా అంతా చూశాక‌, మీకు న‌చ్చ‌క‌పోతే అప్పుడు మారుస్తానేమో. ఇప్పుడు మాత్రం మార్చ‌ను” అన్నార్ట‌. దాస‌రి మొండిత‌నం చూసి ఎస్వీఆర్ ముచ్చ‌ట‌ప‌డిపోయార్ట‌. “నేను ఇంత క‌సురుకున్నా.. నువ్వు క‌ర‌గ‌లేదంటే గ‌ట్టోడివే.. పైకొస్తావ్‌” అని మెచ్చుకుంటూ.. దాస‌రి రాసిన డైలాగ్ లో అక్ష‌రం కూడా మార్చ‌కుండా చెప్పేశార్ట‌. ద‌ట్ ఈజ్ దాస‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ కుట్రలకు వీరనారిలా ఎదురు నిలిచిన మహిళ..!!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసింది. వ్యవస్థలను తమ చెప్పు,చేతుల్లో ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చిందన్న విమర్శలు మూటగట్టుకుంది. దాంతో ఎన్నికలను కూడా సరైన విధంగా నిర్వహించేందుకు వైసీపీ సహకరిస్తుందా..? అనే...

రంగంలోకి కేజ్రీవాల్… బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతారా..?

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవల మధ్యంతర బెయిల్ రావడంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతమేర ఉంటుందనేది చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఢిల్లీలోని లోక్ సభ...

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close