రమేష్‌కుమార్ లేఖపై లేఖ ద్వారా విచారణ కోరుతున్న విజయసాయి..!

ఎస్‌ఈసీగా ఉన్న సమయంలో రమేష్ కుమార్ ..కేంద్ర హోంశాఖరు రాసిన లేఖ విషయంలో విజయసాయిరెడ్డికి ఇంకా అనుమానాలు మిగిలి ఉన్నాయి. అసలు ఆ లేఖ ఎక్కడి నుంచి వెళ్లింది… ఆ లేఖపై విచారణ జరిపించాలంటూ.. డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో ఫోర్జరీ సంతకాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా చేసిన సంతకానికి.. హోంశాఖకు రాసిన లేఖలో సంతకానికి మధ్య తేడా ఉందని గుర్తించినట్లుగా విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. లేఖను కనకమేడల, వర్ల రామయ్య, టీడీ జనార్ధన్‌ సృష్టించారని.. లేఖలో ఆరోపించారు.

ఈ తతంగమంతా ఎన్నికల మాజీ కమిషనర్‌ రమేష్‌ కుమార్‌కు తెలిసే జరిగిందని.. ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై డీజీపీ విచారణ చేయాలని కోరారు. లేఖను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాలి..బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని .. ఐపీ ఆధారంగా లేఖ పంపిందెవరో గుర్తించాలని లేఖలో విజయసాయిరెడ్డి డీజీపీని కోరారు. నిజానికి ఈ విషయంలో విజయసాయిరెడ్డికి ధర్డ్ పర్సన్. ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. నిజంగా..సంతకం ఫోర్జరీ అయితే.. రమష్ కుమార్ ఫిర్యాదు చేయాలి. అప్పుడే ఆ ఫిర్యాదు వ్యాలిడ్ అవుతుంది. కానీ విజయసాయిరెడ్డి మాత్రం.. తనకే మాత్రం సంబంధం లేకపోయినా… ముగ్గురు టీడీపీ నేతల్ని కలిపేసి.. రమేష్ కుమార్‌కు తెలిసే జరిగిందని ఆరోపిస్తూ.. విచారణ చేయాలని లేఖ రాశారు.

రమేష్ కుమార్ కి తెలిసే ఆ లేఖ రాస్తే.. ఇక సమస్యే లేదు. తమపై లేదా.. ప్రభుత్వంపై కుట్ర పన్నారని భావిస్తే.. ఆ మేరకు.. ఫిర్యాదు చేయాలి. కానీ విజయసాయిరెడ్డి డీజీపీకి లేఖ రాసి.. దాన్ని మీడియాకు విడుదల చేశారు. ఎస్‌ఈసీ లేఖ మీడియాకు విడుదలైనప్పటి నుంచి అది ఫేక్ అని చెప్పేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. లేఖ అందిందని.. రక్షణ కల్పించామని.. హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చెప్పిన తర్వాత అది ఎలా బయటకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు.. రమేష్ కుమార్ కు తెలిసే టీడీపీ నేతలు ఆ లేఖ రాశారంటూ.. కొత్త వాదన వినిపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close